Vani Kapoor Accident:ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ (Vaani Kapoor) తాజాగా ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం జైపూర్ లో ఒక సినిమా షూటింగ్లో ఆమె స్కూటీకి యాక్సిడెంట్ అయినట్లు సమాచారం. పెర్కోటా జైపూర్లో బాపు బజార్లో వాణీ కపూర్ స్కూటీ డ్రైవ్ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే అదే సమయంలో హీరోయిన్ నడుపుతున్న స్కూటీ సమీపంలో ఆగి ఉన్న పోలీస్ కారును ఢీకొట్టింది. నివేదికల ప్రకారం సినిమాలోని ఒక సన్నివేశంలో స్కూటీ రైడ్ సన్నివేశం ఉంటుందట. దీంతో హీరోయిన్ షూట్ కంటే ముందే స్కూటీ నడపడం ప్రాక్టీస్ చేస్తోందట. అయితే అదే సమయంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ అక్కడే ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిందని, దాంతో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, ఆమెను చిత్ర బృంద రక్షించారని, అయితే ఈ ప్రమాదంలో వాణీకి ఎటువంటి గాయాలు కాలేదని చిత్ర బృందం వెల్లడించింది.
‘అబిర్ గులాల్’ మూవీలో వాణీ కపూర్..
ఇకపోతే ప్రస్తుతం వాణీ కపూర్ నటిస్తున్న సినిమా ‘అబిర్ గులాల్’. ఈ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఫవాద్ కూడా త్వరలో జైపూర్ రానున్నట్లు సమాచారం. నవంబర్ 18వ తేదీన జైపూర్ లోని శివ విలాస్ హోటల్ లో .. సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
జైపూర్ తో ప్రత్యేక అనుబంధం..
వాణీ కపూర్ కి జైపూర్ ప్రాంతంతో మంచి అనుబంధం ఉంది. అంతేకాదు ఆమె మొదటి సినిమా అయినా శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ కి అడుగుపెట్టింది. ఇందులో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput), వాణీ కపూర్ (Vaani Kapoor), పరిణీతి చోప్రా(Pariniti chopra) కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఈ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న, ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది.
వాణీకపూర్ నటించిన తెలుగు సినిమాలు..
వాణీకపూర్ బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా నటించింది. ఈమె నటించిన ‘ఆహా కళ్యాణం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఇందులో నాచురల్ స్టార్ నాని (Nani )హీరోగా నటించిన విషయం తెలిసిందే.
వాణీకపూర్ కెరియర్..
బాలీవుడ్ కి చెందిన వాణీకపూర్ 1988 ఆగస్టు 23న ఢిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి శివ్ కపూర్ ఫర్నిచర్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారవేత్త. ఈమె తల్లి డింపికపూర్ టీచర్గా మారి ఆ తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. టూరిజం స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె తొలుత మోడల్ గా పనిచేసి, ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా తన తొలి రొమాంటిక్ కామెడీ చిత్రం రొమాన్స్ తో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ సినిమాలో ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఇక 2018లో వచ్చిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ.