Lady Aghori: అఘోరీ మాత శివాలెత్తింది. ఏకంగా కర్ర తీసుకొని చితకబాదింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే అఘోరీ మాతపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే…
తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం గా మారిన అఘోరీ మాత తెలియని వారుండరు. ఈమె ఇటీవల పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి వార్తల్లో నిలిచారు. నిన్న అఘోరా గురువును కలిసిన, అఘోరీ మాత వేములవాడ ఆలయంలో గల దర్గాను తొలగించేంత వరకు తన పోరాటం సాగుతుందని, అప్పటికీ స్పందన లేకుంటే తాను ఏంటో, తన శక్తి ఏంటో చూపుతానని అఘోరీ మాత అన్నారు.
అయితే తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు అఘోరీ మాత. అఘోరీ మాత కంటే ఆమె కారుకు యూత్ లో క్రేజ్ ఎక్కువ. కారు పైన స్టిక్కర్లు, కారు లోపల పుర్రెలు, ఇలా ఒకటి కాదు కారు మొత్తం కొత్త తరహాలోనే అలంకరించబడి ఉంటుంది. అందుకే కాబోలు అఘోరీ మాత ఎక్కడికి వెళ్లినా, ఆమె కారుకు సైతం క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు.
ఈ దశలో మంగళవారం తన కారును శుభ్రపరిచేందుకు సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లారు అఘోరి మాత. మంగళగిరిలోని ఓ కారు వాష్ సెంటర్ వద్దకు కారును తీసుకువెళ్లిన అఘోరీ మాత వెంటనే సర్వీస్ చేసి ఇవ్వాలని కోరారు. ఇలా వాటర్ సర్వీస్ సిబ్బంది, ఆమె కారును శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ విషయం తెలుసుకున్న పలువురు యువకులు, మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు.
కారును వాష్ చేస్తుండగా, యువకులు సెల్ ఫోన్ లో వీడియోలు తీయడం ప్రారంభించారు. అదే క్రమంలో పలువురు మీడియా మిత్రులు కూడా కారును వీడియో తీస్తుండగా, అప్పుడే తీవ్ర ఆగ్రహంతో కర్ర తీసుకొని అఘోరీ మాత మంగళగిరిలో హల్చల్ చేశారు. ఇష్టారీతిన అక్కడ యువకులను, ఓ మీడియా ప్రతినిధిని సైతం కర్రతో బాదగా, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఈ దాడి పై సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమపై కర్రలతో దాడి చేసినట్లు యువకులు తెలుపుతుండగా, అసలు ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాలంటే అఘోరీ మాత స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఏకంగా అఘోరీ మాత కర్రతో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జర్నలిస్టుపై అఘోరి దాడి..
మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న జర్నలిస్ట్ పై దాడి చేసిన అఘోరి#Mangalagiri #Aghori #Attack #BigTV pic.twitter.com/jkvk4CAKeP
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2024