BigTV English

Varalaxmi Sarathkumar Wedding: ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం.. ఫోటోలు చూశారా..?

Varalaxmi Sarathkumar Wedding: ఘనంగా వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం.. ఫోటోలు చూశారా..?

Varalaxmi Sarathkumar Wedding: కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్- నికోలాయ్ సచ్ దేవ్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. థాయ్‌లాండ్‌లోని ఓ బీచ్ రిసార్ట్‌లో జూలై 2న‌ వీరి వివాహం అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెళ్లి బట్టల్లో నూతన వధూవరులు చూడముచ్చటగా ఉన్నారు.


రెడ్ కలర్ పట్టుచీరలో వరలక్ష్మీ మెరవగా.. వైట్ పంచెలో నికోలాయ్ కనిపించాడు. ఇక శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ తో పాటు వరలక్ష్మీ తల్లి, సోదరి కూడా ఈ పెళ్ళిలో హంగామా చేశారు. కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ పెళ్ళిలో సందడి చేశారు. చెన్నైలో వీరి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే.

టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి జరిగిన వారం తరువాత వరూ పెళ్లి ఫోటోలను రిలీజ్ చేశారు. నికోలాయ్ సచ్ దేవ్ కు ఇది రెండో వివాహం. అతనికి ఇది వరకే పెళ్లి అయ్యి.. ఒక కూతురు కూడా ఉంది.


14 ఏళ్ళ క్రితమే వరలక్ష్మీ లవ్ స్టోరీ మొదలయ్యిందంట. ఈ విషయాన్నీ ఆమె చెప్పుకొచ్చింది. నార్వేలో నార్తర్న్‌ లైట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడే నికోలాయ్.. ఆమెకు ప్రపోజ్ చేశాడట. ఇక అతడి మొదటి పెళ్లి గురించి తనకు అవసరం లేదని, అందాన్ని చూసి కాదు మనసును చూసి ప్రేమించానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×