Stargate Venture : అంతర్జాతీయంగా ఏటికేటా క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇన్నాళ్లు ప్రమాదకరంగా భావించిన ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టొచ్చు అంటున్నాయి… అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు. క్యాన్సర్ వైద్యానికి టెక్ సంస్థలకు సంబంధం ఏంటని సందేహిస్తున్నారా.? ఇలాంటి అనుమానాలకు సమాధానంగానే.. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలైన ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును ప్రారంభించాయి. వైద్య రంగంలోని అనేక అపరిశ్కృత సమస్యలకు.. అందుబాటులోని సాంకేతికతను వినియోగించుకుని పరిష్కారాలు రాబట్టనున్నారు. అందులో.. క్యాన్సర్ టీకా ముందు వరుసలో నిలువనుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైట్ హౌస్ వేదికగా.. ఈ సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల అధిపతులైన ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ పాల్గొన్నారు. వీరు వెల్లడించిన సమాచారం మేరకు.. ప్రాణాంతకమైన క్యాన్సర్ ను మనిషి శరీరంలో గుర్తించిన 48 గంటల్లోపే ప్రత్యేక టీకాను రూపొందించవచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయంగా వైద్య, టెక్ రంగాల్ని ఈ కలయిక ఆశ్చర్యపరుస్తోంది. వీరు ఎలాంటి సరికొత్త మార్పులు సృష్టించనున్నారో అనే ఆసక్తితో ఈ ప్రాజెక్టు గురించి వెతుకుతున్నారు.
ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో ‘స్టార్‌గేట్’ (StarGate) అనే వెంచర్‌ను ప్రారంభించాయి. ఈ సంస్థకు కావాల్సిన పెట్టుబడుల్ని ఈ సంస్థలు సమకూర్చనుండగా.. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 10 డేటా సెంటర్లు నిర్మిస్తుండగా, త్వరలోనే ఆ సంఖ్యను 20కి పెంచేందుకు ప్రణాళికలు రచించారు. కాగా.. విస్తృత విషయాలు, అంశాలపై పరిశోధనలు చేయనున్న ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో డేటా అవసరం అవనుండగా.. టెక్సాస్‌లోని అతిపెద్ద డేటా సెంటర్ల సాయంతో ఏఐ లో నూతన ఆవిష్కరణలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద అమెరికాలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని వినియోగించుకుని.. క్యాన్సర్ (Cancer)ను వేగవంతంగా గుర్తించడం సాధ్యం అవుతుందని, దానికి తగ్గట్లు టీకాలు సైతం తయారు చేయవచ్చని వెల్లడించారు.భించనుంది’’ అని వెల్లడించారు.
క్యాన్సర్ ని ఏఐ ఎలా గుర్తిస్తుంది
క్యాన్సర్ కణాలు శరీరంలోని ఏదైనా ఓ భాగంలోకి చేరుకుని అక్కడ క్రమంగా విస్తరిస్తుంటుంది. దాంతో.. ఆయా భాగాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. అయితే.. గతంలో ప్రారంభ దశలో క్యాన్సర్ ని గుర్తించే టెక్నాలజీ లేదు. కానీ.. ప్రస్తుత వైద్య విధానాలు, అందుబాటులోకి వచ్చిన ఏఐ సాయంతో.. రక్తంలో తేలియాడే ట్యూమర్స్ ని సులువుగా గుర్తించవచ్చు. ఇప్పుడున్న ఏఐ పరిజ్ఞానం ఈ పనిని నిముషాల్లోనే చేస్తుంది. అలా గుర్తించిన వెంటనే.. రక్తపరీక్ష ద్వారా పకడ్భందీగా నిర్ధరించుకుని.. వైద్య చికిత్స మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే.. ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు క్యాన్సర్ టీకాలను అభివృద్ధి చేశాయి. ఆయా టీకాలను అందించి, కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చు.
Also Read : ఇకపై పౌరసత్వం సులువు కాదు.. ట్రంప్ ఆదేశాలు చూసి అంతా షాక్.. ఎందుకు ఇంత తొందర..
ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలతో పాటు ప్రతీ వ్యక్తికి వారి క్యాన్సర్ రకాన్ని, దాని ప్రత్యేక లక్షణాల్ని బట్టి ప్రత్యేక టీకాను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని అంటున్నారు. రక్తంలోని క్యాన్సర్ ట్యూమర్ ని ఏఐ సాయంతో విశ్లేషించి, దాని నిర్మూలించేందుకు ప్రత్యేక టీకాను రూపొందించవచ్చు. క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించేందుకు.. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను ఏఐ సాయంతో రోబోటిక్ టెక్నాలజీతో 48 గంటల్లోనే తయారు చేసే వీలుంటుంది. ఆ పనినే ఇప్పుడు.. ఈ స్టార్ గేట్ అనే సంస్థ చేయనుంది. ఈ విషయాన్ని ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో వివరించారు. ’’ అని వెల్లడించారు.