BigTV English

Akhanda 2: బాలయ్య మూవీలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ కూతురు.. ఇది కదా కావాల్సింది..!

Akhanda 2: బాలయ్య మూవీలో ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ కూతురు.. ఇది కదా కావాల్సింది..!

Akhanda 2:బాలకృష్ణ (Balakrishna).. ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. యాక్షన్ పర్ఫామెన్స్ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పటివరకు వరుసగా నాలుగు చిత్రాలతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇటీవల ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి ఆయన అందించిన విశేష సేవలకు గానూ.. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మూడవసారి ఎన్నికయ్యారు. అంతేకాదు తన తల్లి పేరు మీద నిర్మించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదండోయ్ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి కూడా హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇలా ఈ వయసులో కూడా ఇంత బిజీ షెడ్యూల్ కొనసాగిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.


అఖండ -2 స్టార్ హీరోయిన్ కూతురు..

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య.. ఇప్పుడు ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ లో నిజమైన అఘోరీల మధ్య ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను (Boyapati Srinu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచీ తాజాగా ఒక అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ(Laya )కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు దూరమైన ఈమె.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి నితిన్ (Nithin)నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రంలో మెప్పించింది. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ (Jabardast) కామెడీ షోకి శివాజీ(Sivaji) తో కలిసి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.


ఇదే నిజమైతే స్టార్ స్టేటస్ గ్యారెంటీ..

ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ ని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన లయ అక్కడే సెటిలైపోయింది .ఒక పాప , బాబు కూడా జన్మించారు .పాప పేరు శ్లోక. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో ఇలియానా చిన్నప్పటి పాత్రలో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరొకసారి శ్లోక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అఖండ సినిమాలో ఒక చిన్న పాప క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 రాబోతోంది కాబట్టి ఆ పాప పాత్రను కంటిన్యూ చేయడం కోసం ఇందులో శ్లోకా ను ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఈ చిత్రం శ్లోకాకు హిట్ తెచ్చిపెట్టి లయ కూతురిగా ఆడియన్స్ కు గుర్తుండిపోయేలా చేస్తుందేమో చూడాలి అని అభిమానులు కూడా ఆశపడుతున్నారు. ఇక దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ALSO READ:Shobhita dhulipala: ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శోభిత.. ఏమన్నారంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×