Aditi Rao Hydari: ప్రముఖ తెలుగు బ్యూటీ అదితి రావు హైదరి (Aditi Rao Hydari)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె పేరుకే తెలుగు నటి అయినా బాలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన సినీ ప్రయత్నాన్ని కూడా అక్కడి నుంచే మొదలుపెట్టి, భారీ క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే ఇటీవల ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (Siddharth)తో రెండో వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె “హీరామండి : ది డైమండ్ బజార్” అనే సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన డాన్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.
హీరామండిలో అద్భుతమైన నటన..
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి రావు హైదరి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అదితి రావు హైదరి మాట్లాడుతూ..”నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూ పెరిగాను.డాన్స్ తోనే పెరిగాను. కానీ హీరామండిలో నేను చేయాల్సింది కథక్. ఈ విషయంలో భన్సాలీని నిరాశకు గురి చెయ్యకూడదని ఎన్నో నిద్రలేని రాత్రులు నేను గడిపాను. ఆయన కోసమే కథక్ కూడా నేర్చుకున్నాను. అంతేకాదు సెట్ లో కొన్నిసార్లు భావోద్వేగ సన్నివేశాలు ఉత్కంఠ భరితమైన పాత్రలలో చేయమంటే రొమాంటిక్ గా చేశాను. ఎంత ప్రయత్నించినా సరే సహజంగా రాకపోవడంతో.. పాత్ర అద్భుతంగా పండడం కోసం, ఆకలితో చేస్తే బాగా వస్తుందని దర్శకుడు భోజనం మానేయమని నాకు సలహా ఇచ్చారు.
ఆకలితో ఆ పాత్ర చేశా..
ఆ సలహా నాకు ఎంతో ఉపయోగపడింది. అలా నిజమైన భావోద్వేగాలను తెరపై చూపించడం కోసం హీరామండి షూటింగ్ పూర్తి అయ్యే వరకు కూడా నేను భోజనం చేయలేదు. అయితే ఈ పద్ధతి నన్ను మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేయడమే కాకుండా ఆ పాత్రకు నన్ను పూర్తి న్యాయం చేసేలా ప్రోత్సహించింది. మొత్తానికైతే పాత్ర బాగా పండడం కోసం నేను ఆహారం మానేయడమే కాదు అసలు ముట్టుకోకుండా అయినా ఉండగలను” అంటూ పాత్ర పై తనకున్న మక్కువను, కాన్ఫిడెంట్ ని చెప్పుకొచ్చింది అదితి రావు హైదరి. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కూడా నటి అంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అదితి రావు హైదరి పర్సనల్ లైఫ్..
అదితి రావు హైదరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమె హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది. కానీ అందరి కోసం మళ్లీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. నిత్యం వెకేషన్స్ కి వెళ్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నిజానికి గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు సిద్దార్థ్ ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మొత్తానికి అయితే టాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ బాలీవుడ్లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు.