BigTV English

Heart Health: చలికాలంలో గుండె సమస్యలు.. వెల్లులిని ఇలా వాడితే ప్రాణాలు సేఫ్

Heart Health: చలికాలంలో గుండె సమస్యలు.. వెల్లులిని ఇలా వాడితే ప్రాణాలు సేఫ్

Heart Health: భారతీయ వంటలలో కచ్చితంగా ఉండే పదార్థం వెల్లుల్లి. దీనిలో ఉండే వైద్య లక్షణాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాంప్రదాయ వైద్యంలో కూడా వెల్లుల్లి ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో శక్తివంతమైన పదార్థంగా వెలుల్లి గురించి వర్ణిస్తారు. కూరల రుచిని పెంచేందుకు వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. రోజువారీ జీవితంలో వెల్లుల్లిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.


భారతీయ వంటకాలలో వెల్లుల్లి అధికంగా వినియోగిస్తారు.  ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ప్రాచీన కాలంలో కూడా వెల్లుల్లి వాడేవారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సల్ఫర్ సమ్మేళనాలు నిండి ఉంటాయి. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైతే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లిని గుండె ఆరోగ్యానికి శక్తివంతమైన ఆహారంగా చెప్పుకుంటారు. చలికాలంలో గుండెపోటు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో వెల్లుల్లి కచ్చితంగా చేర్చుకోండి.

వెల్లుల్లిలో అల్లిసిన్, థియోసల్ఫినేట్, అజోయెన్, ఫినోలిక్ సమ్మేళనాలు, డయల్ సల్ఫైడ్, డయాలిల్ డైసల్ఫైడ్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తాయి. దీనివల్ల వృద్ధాప్యం గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి.


ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అని పిలిచే సల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచితే దీనిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ గుణాలు గుండెకు రక్షణగా నిలుస్తాయి. రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి అందులో కొంచెం తేనె కలిపి తినడం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో అలా తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. శరీరానికి రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రతిరోజు వెల్లుల్లి, నెయ్యి కలిపి తింటే గుండె ఆరోగ్యం సమర్ధవంతంగా ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇతర నూనెలతో పోలిస్తే నెయ్యి గుండెకు మంచిది. నెయ్యిని వెచ్చగా మార్చి అందులో వెల్లుల్లిని దంచి కలపండి. ఆ మిశ్రమాన్ని అన్నం లేదా రోటీతో కలిపి తినండి. ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ప్రతిరోజు వెల్లుల్లి నిమ్మరసం కలిపి తాగినా కూడా ఎంతో మేలు. చలికాలంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లితో నిమ్మరసం కలిసి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నిమ్మకాయల్లో శుభ్రపరుస్తుంది. వెల్లుల్లిలోని గుణాలు రక్తనాళాలను సడలించి ప్రతి అవయవానికీ రక్తప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. తాజా వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా దంచండి. ఆ ముద్దలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగేయండి. ఇలా తరచూ తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Also Read: టీ ఎక్కువ సేపు మరిగిస్తే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

వెల్లుల్లిని పసుపు పాలలో కలుపుకొని తాగితే ఎంతో మంచిది. పసుపు, వెల్లుల్లి రెండింట్లోని యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ధమనుల్లో వాపును తగ్గిస్తుంది. గుండెకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. ఈ పానీయాన్ని తయారు చేయడానికి వేడి చల్లార్చిన పాలను ఒక గ్లాస్ లో తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి కలిపేయాలి. అలాగే చిటికెడు పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి, చిటికెడు దాల్చిన పొడి వేసి బాగా కలుపుకొని తాగేయాలి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×