BigTV English

Aditi Rao Hydari: అదితి మొదటి భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

Aditi Rao Hydari: అదితి మొదటి భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

Aditi Rao Hydari.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) హైదరాబాదుకు చెందిన అమ్మాయి. అయినప్పటికీ బాలీవుడ్ లో సినిమాలు చేసి అక్కడ మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక తెలుగులో మహాసముద్రం సినిమాలో హీరో సిద్దార్థ్ (Siddharth )తో కలిసి నటించిన ఈమె, అదే హీరోతో ప్రేమలో పడింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ పలుమార్లు మీడియా కంటపడ్డారు. అంతేకాదు హోటల్లో కూడా కనిపించారు ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా.. సిద్దార్థ్ మీడియాపై మండిపడ్డారు కూడా.. అయినా సరే మీడియా రకరకాల రూమర్లు సృష్టించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఎట్టకేలకు మీడియా రూమర్స్ నిజం చేస్తూ ఈ యేడాది మార్చి 27వ తేదీన అదితి రావు హైదరి, సిద్దార్థ్ తో నిశ్చితార్థం జరుపుకుంది.


ఎట్టకేలకు సిద్దార్థ్ తో ఏడడుగులు వేసిన అదితి..

ఆ సమయంలో ఫోటోలు బయటకు రాగా వీరిద్దరి వివాహం చేసుకున్నారంటూ అందరూ కామెంట్లు వైరల్ చేయగా.. తాము నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నామని ప్రకటించిన ఈ జంట , తాజాగా తెలంగాణ వనపర్తి లోని శ్రీరంగాపూర్ లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇకపోతే ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అదితి రావుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె మొదటి భర్త ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసలు ఎందుకు విడిపోయారు ? అనే విషయాలు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

ఆదితి రావు హైదరి మొదటి భర్త బ్యాక్ గ్రౌండ్..

Aditi Rao Hydari: What is Aditi's first husband's background.. Do you know what he is doing now..?
Aditi Rao Hydari: What is Aditi’s first husband’s background.. Do you know what he is doing now..?

అసలు విషయంలోకెళితే.. అదితి రావు హైదరి ఇండస్ట్రీలోకి రాకముందు సత్య దీప్ మిశ్రా (Satyadeep Mishra ) ను 2002లో వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య కాస్త ఒడిదుడుకులు ఏర్పడడంతో 2012లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటివరకు ప్రేమ, పెళ్లి , విడాకుల గురించి స్పందించని అదితి రావు హైదరి తొలిసారి 2013లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని విడాకుల గురించి కూడా స్పష్టం చేసింది. ఇక ఈమె మొదటి భర్త పేరు సత్యదీప్ మిశ్రా.. ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ గా అలాగే కార్పొరేట్ లాయర్ గా కూడా పనిచేశారు.


చిల్లర పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సత్యదీప్..

సత్యదీప్ మిశ్రా తొలుత ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి, చిల్లర పార్టీ అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే సినిమాల ద్వారా గుర్తింపు రాకపోవడంతో ఓటీటీ వైపు వెళ్లిపోయారు. 2012లో అతిధిరావు హైదరీతో విడాకుల అనంతరం..2013 లో జనవరి 27వ తేదీన మీనాగుప్త కూతురు మసాబా గుప్తాను పెళ్లి చేసుకున్నారు.. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే అటు మసాబా గుప్తానికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ప్రస్తుతం సత్యదీప్ మిశ్రా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అదితి రావు హైదరి మొదటి భర్త బ్యాక్ గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×