BigTV English

Arjun Tendulkar: 9 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండుల్కర్

Arjun Tendulkar: 9 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండుల్కర్

Arjun Tendulkar shines with 9-wicket haul for Goa in KSCA Invitational: ఇన్నాళ్లకు సచిన్ కొడుకు ఒక్కసారి వార్తల్లో నిలిచాడు. 24 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ దేశవాళి క్రికెట్ లో రాణించి ఒక మ్యాచ్ లో 9 వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. సెలబ్రిటీల కొడుకులు అందరూ సెలబ్రిటీలు కాలేరు. సచిన్ టెండుల్కర్ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు. కానీ కుమారుడికి అంత ప్రతిభ రాలేదు. దాంతో సాధన చేశాడు. తండ్రిలా బ్యాటింగ్ లో కాదు.. బౌలింగును ఎంచుకుని.. నేడు అదరగొట్టాడు.


ప్రస్తుతం అర్జున్.. టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 3 వికెట్లు తీసుకున్నాడు.

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో అర్జున్ బంతిలో అద్భుతం చేశాడు. తొలి మ్యాచ్ కర్ణాటక వర్సెస్ గోవా మధ్య జరిగింది. అయితే అర్జున్ టెండుల్కర్  గోవా తరఫున ఆడాడు.


అయితే అర్జున్ టెండుల్కర్.. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తానికి మ్యాచ్ వన్ సైడ్ అయ్యి, గోవా 189 పరుగుల తేడాతో విజయం సాధించింది. కర్ణాటకను చిత్తు చేసింది.

Also Read: ప్యూచర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు

వివరాల్లోకి వెళితే.. ముందుగా ఆతిథ్య కర్ణాటక జట్టు బ్యాటింగ్ చేసింది. అర్జున్ (5/41) ధాటికి 103 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గోవా తొలి ఇన్నింగ్స్ లో 413 పరుగుల భారీ స్కోరు చేసింది. అభినవ్ తేజ్ (109) సెంచరీ చేశాడు. మంతన్ (69) ఆఫ్ సెంచరీ చేశాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. ఈసారి కూడా అర్జున్ బౌలింగు (4/46) ఎదుర్కోలేక తడబడింది. ఈసారి 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో 189 భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే కర్ణాటక టీమ్ లో చాలామంది దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. అందువల్ల సాధారణ ఆటగాళ్లు ఆడటం వల్ల.. అర్జున్ కి వికెట్లు ఇచ్చేశారని నెటిజన్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా  అర్జున్ టెండూల్కర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో .. 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి 87 పరుగులు ఇచ్చి.. 9 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాబోవు రంజీ ట్రోఫీలో.. తను ప్రధాన బ్యాటర్లకి సవాల్ విసిరేలాగే ఉన్నాడు. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ ఇంతవరకు దేశవాళీ క్రికెట్ మూడు ఫార్మాట్లలో 49 మ్యాచ్‌లు ఆడి 68 వికెట్లు పడగొట్టాడు.

Related News

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

Big Stories

×