BigTV English

The GOAT: విజయ్ ‘గోట్’ మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్.. మీనాక్షి ఎంత అందంగా ఉంది రా బాబు

The GOAT: విజయ్ ‘గోట్’ మూవీ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్.. మీనాక్షి ఎంత అందంగా ఉంది రా బాబు

Greatest of all time: దళపతి విజయ్‌కి అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతడి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఓ రేంజ్‌లో హంగామా ఉంటుంది. అయితే గతంలో విజయ్ నటించిన ‘లియో’ భారీ హైప్‌తో రిలీజ్ అయి కోలీవుడ్‌లో సూపర్ టాక్‌ను అందుకుంది. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కోలీవుడ్‌లో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సైతం నమోదు చేసింది. మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా కొందరికి మాత్రమే ఎక్కింది.


ఇక ఈ మూవీ సక్సెస్‌ జోష్‌లో విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ దర్శకడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ రెండు డిఫరెంట్‌ రోల్స్ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

Also Read: విజయ్ బర్త్ డే.. కొత్త సినిమా స్పెషల్ వీడియో మామూలుగా లేదుగా..


ఇందులో విజయ్‌కు జోడీగా అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో స్నేహా, ప్రభుదేవ, లైలా, కిచ్చా సుదీప్, యోగిబాబు వంటి స్టార్ నటీ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లింప్స్‌లో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టేశాడు.

మాస్ యాక్షన్ సీన్లతో చూపించిన గ్లింప్స్ విజయ్ అభిమానుల్లో ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విడుదలైన రెండు సాంగ్స్‌కి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే మేకర్స్ ఇప్పుడు మరో అప్డేట్ అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్ చేశారు. స్పార్క్ అంటూ సాగే ఈ సాంగ్‌లో విజయ్, మీనాక్షీ చౌదరి లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×