Akhil Akkineni : ఉండాల్సింది కటౌట్ కాదు.. కంటెంట్ అని తెలుసుకున్న హీరోల్లో అఖిల్ ఇప్పుడు కాస్త ముందు వరుసలో ఉంటాడు. దాదాపు రెండేళ్లు కష్టపడి బాడీ బిల్డింగ్ చేసి… చేసిన ఏజెంట్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇది గడిచి… రెండేళ్లు అవుతున్నా… అఖిల్ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఎన్నో కథలు విన్న తర్వాత… కంటెంట్ ఉన్న కథను పట్టుకున్నాడట ఇప్పుడు. అది కూడా కింగ్ నాగార్జున వల్ల వచ్చిందని ఇండస్ట్రీలో టాక్.
ఇంతకి అఖిల్ కొత్త మూవీ ఎప్పటి నుంచి స్టార్ట్..?
దానికి డైరెక్టర్ ఎవరు..? కథేంటి..?
ఆ కథను అఖిల్‌కి వచ్చేలా నాగ్ ఏం చేశాడు..?
అనేవి ఇప్పుడు తెలుసుకుందాం…
2023 ఏప్రిల్ చివరి వారంలో అఖిల్ రెండేళ్ల కష్టం ఏజెంట్ మూవీ థియేటర్‌లోకి వచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. దాదాపు 90 కోట్లు పెట్టి నిర్మించిన ఈ మూవీకి కనీసం 9 కోట్ల కలెక్షన్లు కూడా రాలేవు. దీంతో కావాల్సింది కటౌట్ కాదు… కంటెంట్ అని అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి.
దీని తర్వాత అఖిల్ చాలా కథలు విన్నాడు. కానీ, ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. తాజాగా ఓ కథ ఫైనల్ అయినట్టు సమాచారం. ఆ కథతో ఈ నెల 14 నుంచి కొత్త సినిమా షూట్ స్టార్ట్ కాబోతుందట. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యం విష్ణు కథ’ అనే విలేజ్ బ్యాగ్రౌండ్ సినిమా చేసిన నందు దీనికి డైరెక్టర్. 14 నుంచే ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం.
‘వినరో భాగ్యం విష్ణు కథ’ మూవీలా ఇది కూడా విలేజ్ నేపథ్యంలో ఉంటుందట. నిజానికి ఈ కథను నిర్మాత సాహు గారపాటి చేసుకున్నాడట. కానీ, ఈ కథ కింగ్ నాగార్జున చెవిన పడటంతో… తన ఫ్యామిలీకి విలేజ్ నేపథ్యంలో ఉండే కథలు అంటే బాగా సెట్ అవుతాయని, సాహు గారపాటికి చెప్పి… అఖిల్ కోసం నాగార్జు తీసుకున్నాడట. అలా… అఖిల్ మూవీ సెట్ అయిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
అవును… అక్కినేని ఫ్యామిలీకి విలేజ్ నేపథ్యంలో ఉండే కథలు అంటే బాగా కలిసొస్తాయి. 2016 సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’, 2022 సంక్రాంతికి వచ్చిన ‘బంగర్రాజు’, 2024 సంక్రాంతికి వచ్చిన ‘నా సామి రంగ’ తో పాటు ఇటీవల నాగ చైతన్య చేసిన ‘తండేల్’ మూవీ కూడా విలేజ్ బ్యాగ్రౌండ్ లోనివే.
ఇలా… అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య విలేజ్ నేపథ్యంలో సాగే కథలతో హిట్స్ కొట్టారు. కానీ, అఖిల్ కెరీర్‌లో ఇప్పటి వరకు భారీ బ్లాక్ బస్టర్ లాంటి సినిమాలు ఒక్కటి లేదు. అలాగే అఖిల్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా విలేజ్ నేపథ్యంలో సాగే మూవీ లేదు. ఇప్పుడు అది రాబోతుంది. దీంతో పాటు అఖిల్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాబోతుందని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. చూడాలి మరి.. నాగార్జున, నాగ చైతన్యకు కలిసొచ్చిన ఈ విలేజ్ బ్యాగ్రౌండ్ స్టోరీ… అఖిల్ కి సెట్ అవుతుందో లేదో….