BigTV English

Covid: వామ్మో.. మళ్లీ కరోనా!.. తెలంగాణకు కేంద్రం అలర్ట్..

Covid: వామ్మో.. మళ్లీ కరోనా!.. తెలంగాణకు కేంద్రం అలర్ట్..

Covid: మీరు చదివింది నిజమే. ఫ్లూ గురించి కాదు. కరోనా గురించే ఈ అలర్ట్. దేశమంతా ఇప్పుడన్నీ H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులే. దగ్గు, జలుబు, జ్వరం, నొప్పులు, వాంతులు, విరేచనాలు.. జనాలను వేధిస్తున్నాయి. తగ్గటానికి చాలా టైమ్ పడుతోంది. దగ్గు అయితే నెలల తరబడి ఉంటోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లే. ఒకటి రెండు మరణాలు కూడా సంభవించడంతో.. ఫ్లూ అంటే కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.


‘ఫ్లూ’ వైరస్ టెన్షన్‌ పెట్టిస్తుంటే.. సందట్లో సడేమియాలో మరుగునపడిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 5వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలోనూ వందల్లో నమోదవుతుండటంతో వర్రీ పెరుగుతోంది. దగ్గు, జలుబు, జ్వరం వస్తే.. కరోనానా? ఫ్లూనా? అనే అనుమానమే మరింత టెన్షన్ పెట్టిస్తోంది.

కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆరు రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తోందని.. ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ లేఖలు రాసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను అలర్ట్ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే విస్తృతంగా చేపట్టాలని సూచించింది.


అయితే, కరోనాపై అంతగా భయపడాల్సిన పని లేదంటూ తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు. కొవిడ్‌ను సీజనల్ డిసీజ్‌లానే చూడాలని.. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని.. ఆందోళన అవసరం లేదని చెప్పారు.

కరోనా వైరస్‌పై కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా.. చెబుతుండటంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. క్లారిటీ లేకున్నా.. ప్రికాషన్స్ మాత్రం మస్ట్. మాస్క్‌ ధరించడం, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపులకు దూరంగా ఉండటం, చేతులతో కళ్లు, ముక్కు, నోరులను తాకకుండా ఉండటం.. లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. యాంటీబయోటిక్స్ మోతాదు మించి వాడటం మంచిది కాదు.

TSPSC: ఒకటి కాదు 5 పేపర్లు లీక్.. ఏ2 నిందితుడు బీజేపీ లీడరేనా?.. పొలిటికల్ హీట్

ED: ఈడీ రాక్స్.. 2 స్టేట్స్ షేక్స్..

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×