Partho Ghosh Death: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ పార్థో ఘోష్ (Partho Ghosh) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈయన మరణ వార్త విని అభిమానులు, ఇటు ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇక పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పార్థో ఘోష్ దర్శకత్వం వహించిన సినిమాల విషయానికొస్తే.. అగ్నిసాక్షి, 100 డేస్, దలాల్, గీత్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక తన సినీ కెరియర్లో మొత్తం 15 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన.. చివరిగా 2018లో ‘మౌసం ఇక్రర్ కే దో పాల్ ప్యార్ కే ‘చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ఈయన.. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధితో మరణించడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.
పార్థో ఘోష్ కెరియర్..
పార్థో ఘోష్.. హిందీ సినీ పరిశ్రమలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన ఈయన 1985 నుండి చిన్న చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఆరంభించారు. ఆ తర్వాత జాకీ ష్రాఫ్(Jackie Shroff), మాధురి దీక్షిత్ (Madhuri Dixit)కాంబినేషన్లో ‘100 డేస్’ అనే సినిమా చేసి దర్శకుడిగా మొదటి ప్రయత్నంలోనే భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం ‘నూరవతు నాల్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించడం జరిగింది. ఇకపోతే 1993లో ‘దలాల్’ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక అలా తన కెరియర్ లో 15 పైగా చిత్రాలకు రచన అలాగే దర్శకత్వం వహించారు.
దర్శకుడుగానే కాదు నిర్మాత కూడా..
ఇకపోతే ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించారు. అనేక బెంగాలీ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించిన పార్థో ఘోష్ వాటిని నిర్మించారు కూడా.. అలా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే 1997లో ఈయన దర్శకత్వం వహించిన ‘అగ్నిసాక్షి’ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ కూడా చేయబడ్డారు. ఈయన తన కెరీయర్లో 100 డేస్, గీత్ , దలాల్, అగ్నిసాక్షి, తీస్రా కాన్, మసీహ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.
also read:Maheshbabu: అఖిల్ రిసెప్షన్ లో మహేష్ ధరించిన టీ-షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్!