BigTV English

Tagubothu Ramesh: లైవ్ లో వెక్కివెక్కి ఏడ్చిన తాగుబోతు రమేష్.. ఆమె వల్లే విరక్తి కలిగిందంటూ..?

Tagubothu Ramesh: లైవ్ లో వెక్కివెక్కి ఏడ్చిన తాగుబోతు రమేష్.. ఆమె వల్లే విరక్తి కలిగిందంటూ..?

Tagubothu Ramesh: తాగుబోతు రమేష్ (Tagubothu Ramesh) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదటిసారి ఈయన గురించి తెలియని వారు ఈయనను చూసిన వెంటనే..” అలా డ్రింక్ చేసి సెట్లో నటించడం ఎంతవరకు కరెక్ట్?” అని అంటారు. కానీ వాస్తవానికి ఆయన మద్యం ముట్టుకోరు.. అయినా సరే అచ్చం మద్యం తాగిన వారిలాగే నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశంపై విరక్తి కలిగి ఉంటుంది. అయితే తనకు మాత్రం తన తల్లి వల్ల విరక్తి కలిగిందని చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తన తల్లి గురించి చెబుతూ లైవ్ లోనే వెక్కివెక్కి ఏడ్చారు రమేష్. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్లలోనే నంది అవార్డు..

2006లో అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన నుండి పట్టా అందుకున్న ఈయన.. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘జగడం’ సినిమాలో శీను స్నేహితుడిగా నటించి మొదటి స్టెప్ వేశారు. ఇక 2009లో వచ్చిన ‘మహాత్మ’ సినిమాలో నటించిన తాగుబోతు రమేష్.. సుమారుగా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గత ఏడాది ఛారి 111, భీమా, భవనం, కేసీఆర్ అంటూ వరుస చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన.. సినిమాలే కాదు ‘అహ నా పెళ్ళంట’, ‘గాలివాన’ వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించారు. అంతే కాదు ‘రెండురెళ్ళుఆరు’ వంటి సీరియల్ లో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇలా తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈయన.. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ హాస్య నటుడు విభాగంలో నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు.


మా అమ్మే జీవితం..

అంతేకాదు జబర్దస్త్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రమేష్.. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని.. తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. “మా అమ్మ సంతానంలో నేను, నా చెల్లి చివరి వాళ్ళం. నా చెల్లి పాలు తాగడం మానేసినా.. మా అమ్మకు నేను పాలు తాగేవాడిని. ఇక దాంతో నేను మా అమ్మకి బాగా కనెక్ట్ అయిపోయాను.అమ్మ లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడిని. అయితే ఒకసారి ‘సింధూరపువ్వు’ సినిమా థియేటర్లో ఆడుతుండగా… ఆ సినిమా చూడడానికి మా అమ్మకు తెలియకుండా మా ఫ్రెండ్ తో కలిసి వెళ్లాను. ఆ సినిమా చూడగానే ఇక సినీ ప్రపంచంలోకే అడుగు పెట్టాలనే కోరిక అప్పుడే మొదలైంది.

అమ్మ చనిపోవడంతో కన్నీటిపై విరక్తి కలిగింది..

ఇక సినిమా చూసి ఇంటికి వెళ్లాక.. మా అమ్మ నాకు బాగా కోడిగుడ్ల కూర పెట్టి చాలా ప్రేమ చూపించింది. ఆరోజు మా అమ్మ నా పైన ఎంతో ప్రేమ చూపిస్తోందని సంబరపడిపోయాను. ఆ తర్వాత నులక తాళ్ళతో మంచానికి కట్టేసి, బాగా కొట్టేసింది. నీ వయసెంత? నువ్వు సినిమాలు చూడడం ఏంటి ?అంటూ నాపై బాగా అరిచేసింది. ఇక దాంతో మా అమ్మకు ఈ విషయం ఎవరు చెప్పి ఉంటారా అని ఆలోచిస్తుండగా.. నాతో పాటు సినిమాకి వచ్చిన నా స్నేహితుడు.. మీ అన్నయ్య మనల్ని థియేటర్లో చూశారు అని చెప్పాడు. నిజానికి ఎందుకో మా అమ్మకు సినిమా అంటే ఇష్టం ఉండేది కాదు. ఇక నేను మాత్రం మా అమ్మను నవ్వించడానికి మా నాన్న బాగా తాగే వారు.. దాంతో నేను మా నాన్న లాగే తాగినట్టు ఊగుతూ నటిస్తే మా అమ్మ చాలా సంతోష పడిపోయేది. ఇక రోజు అమ్మను సంతోష పెట్టడానికి నేను అలాగే చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు మళ్లీ మా అమ్మకు తెలియకుండా.. చిరంజీవి(Chiranjeevi ) ‘రిక్షావోడు’ సినిమా థియేటర్లలో చూస్తున్నప్పుడు.. సడన్గా ఒకరొచ్చి త్వరగా రా మీ అమ్మ చచ్చిపోయింది అన్నారు. ఇక అంతే 14 ఏళ్ళ వయసులో ఉన్న నేను ఒక్కసారిగా అమ్మ చనిపోయింది అని వినేసరికి జీవితం మొత్తం శూన్యం అయిపోయింది. కదలేకపోయాను. ఇక ఏం చేయాలో తెలియక ఇంటికి పరిగెత్తుకు వెళ్లిపోయాను. మా అమ్మ ఒక టీబీ పేషెంట్. ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే ఇంత త్వరగా నన్ను వదిలి వెళ్తుందని అనుకోలేదు. ఇక మా అమ్మ చనిపోయేసరికి మా అవ్వను పట్టుకొని బాగా ఏడ్చేసాను. ఒక్కొక్కరిగా మా అమ్మని చూడడానికి వచ్చే కొద్ది నా దుఃఖం అప్పుకోలేకపోయాను. అలా మా అమ్మ కోసం ఏడ్చి ఏడ్చి కన్నీటిపై విరక్తి పుట్టింది అంటూ లైవ్ లోనే తన తల్లిని తలుచుకొని మళ్ళీ ఏడ్చేశారు తాగుబోతు రమేష్. మా అమ్మకు సినిమా చూడడం ఇష్టం లేదు. నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇక ఇప్పుడు నేను ఆ ఇండస్ట్రీ లోకి వచ్చే నంది అవార్డు అందుకున్నాను. చూడడానికి మా అమ్మ లేదు అంటూ మరింత దుఃఖితులయ్యారు. ఇక తాగుబోతు రమేష్ ఏడవడం చూసి నెటిజెన్స్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లి లేని లోటు తనకు జీవితాంతం ఉంటుందని చెప్పుకొచ్చారు తాగుబోతు రమేష్.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×