BigTV English

MS Dhoni: తెలుగు తెరపై మరో స్టార్ క్రికెటర్.. మెగా హీరో సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ..?

MS Dhoni: తెలుగు తెరపై మరో స్టార్ క్రికెటర్.. మెగా హీరో సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ..?

MS Dhoni: ఈరోజుల్లో క్రికెటర్స్ కూడా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగా క్రికెట్‌లో ఫేమ్ సంపాదించుకోగానే ఎన్నో బ్రాండ్స్.. వాటి ప్రమోషన్స్ కోసం క్రికెటర్స్ వెంటపడుతుంటారు. అలా దాదాపు ఇండియన్ క్రికెటర్స్ అంతా ఏదో ఒక బ్రాండ్ ప్రమోషన్‌లో నటించినవారే. అందులో ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనీ కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నోసార్లు బుల్లితెరపై యాడ్స్‌లో కనిపించి అలరించిన ఎమ్ ఎస్ ధోనీ (MS Dhoni).. ఇప్పుడు వెండితెరపై అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. అది కూడా ఒక తెలుగు సినిమాతో ధోనీ డెబ్యూ చేయనున్నాడని ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.


డేవిడ్ వార్నర్ బాటలో

ఇప్పటికే తెలుగు సినిమాల్లో క్రికెటర్స్ యాక్ట్ చేయడం అనే కొత్త ట్రెండ్ మొదలయ్యింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ సినిమాతో డేవిడ్ వార్నర్ తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. చెప్పడానికి వార్నర్ ఒక ఆస్ట్రేలియన్ క్రికెటరే అయినా తనకు తెలుగు సినిమాలంటే ఎంత ఇష్టమో తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకే డేవిడ్ వార్నర్‌కు సినిమాల్లో చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఆశపడ్డారు. వారు కోరుకున్నట్టుగానే ‘రాబిన్‌హుడ్’లో చూడబోతున్నారు. డేవిడ్ వార్నర్ తర్వాత ఇప్పుడు తెలుగు చిత్రంలో మెరవడానికి ఎమ్ ఎస్ ధోనీ కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.


ట్రైనర్ పాత్రలో

రామ్ చరణ్ (Ram Charan).. ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్సీ 16’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న విషయం ఇప్పటికే బయటపడింది. ఇందులో క్రికెటర్‌గా కనిపించడం కోసం చరణ్ సిద్ధమవుతున్నాడనే రూమర్స్ కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాతో ధోనీ తెలుగు తెరపై డెబ్యూ చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ ప్రచారం సాగుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్ అయితే తన ట్రైనర్ పాత్రలో మెరవడానికి ధోనీ పేరు పరిగణనలోకి తీసుకుంటున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన ధోనీతో సంప్రదింపులు జరిపారో లేదో తెలియాల్సి ఉంది.

Also Read: బౌండరీ నుండి బాక్సాఫీస్ వరకు.. వార్నర్ ఇంట్రక్షన్ పోస్ట్..!

నిర్మాతగా డెబ్యూ

ఎన్నో ఏళ్లుగా ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ క్రికెటర్‌గా వెలిగిపోతున్న ఎమ్ ఎస్ ధోనీ.. కొన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు. నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో ఒక తమిళ చిత్రాన్ని కూడా నిర్మించారు. అయితే నిర్మాతగా మారాడు కాబట్టి తన నిర్మించిన మొదటి సినిమాలో ధోనీ క్యామియో చేస్తాడని అప్పట్లోనే ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. వెండితెరపై నటుడిగా కనిపించడానికి తను ఇష్టపడలేదు. మరి ‘ఆర్సీ 16’లో కనిపించడానికి ధోనీని సంప్రదిస్తే తన స్పందన ఎలా ఉంటుంది, ఒక తెలుగు సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి తను ఒప్పుకుంటాడా అని అందరిలో చర్చలు మొదలయ్యాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×