Unstoppable with NBK S4 :నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె.. మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా జరుపుకుంటోంది. అందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విచ్చేయగా ఆ తర్వాత ఒక్కొక్కరు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షో కి వచ్చి సందడి చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇక ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi), నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)వచ్చి సందడి చేశారు. అయితే ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి ఊహించని గెస్ట్ అతిథిగా రాబోతున్నారని, ఆహా టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆహా వేదికపై రామ్ చరణ్..
ఆ అనుకోని అతిథి ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం ఈయన ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. శంకర్ (Shankar) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే రామ్ చరణ్ ఇప్పుడు ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ బృందం అధికారికంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా..” ఒరేయ్ చిట్టి బాబు వస్తున్నాడు.. రీ సౌండ్ ఇండియా అంతా వినపడేలా చెయ్యండి” అంటూ ఫైర్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అంతేకాదు ఈ ఎనిమిదవ ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల అనగా జనవరి మొదటి వారంలో ఈ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం..
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి సుకుమార్(Sukumar ), బుచ్చిబాబు(Bucchibabu ) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జనవరి 4వ తేదీన రాజమండ్రిలోని ఓపెన్ గ్రౌండ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, కూటమి ప్రభుత్వం ఇలా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించబోతున్నట్లు సమాచారం. మరొకవైపు నిన్న వజ్ర గ్రౌండ్స్ లో .. రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ను లాంచ్ చేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇదే అతిపెద్ద కటౌట్ కావడం గమనార్హం. ఇకపోతే ఈ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.