Sankranthiki Vasthunnam : అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 50 మిలియన్స్ కు పైగా ఈ పాటకు వ్యూస్ వచ్చాయి. పదహారేళ్ల తర్వాత రమణ గోగుల ఈ పాటను ఆలపించారు. ఈ పాట రిలీజ్ అయిన వెంటనే అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పాడిన సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సినిమాలలో ఈ సినిమా మీద మినిమం అంచనాలు ఉన్నాయి. కానీ రిలీజ్ అయిన సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు ఇంకాస్త పెరిగాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.
మామూలు సీజన్లో కంటే సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సీజన్ లో సినిమాలకి మార్కెట్ విపరీతంగా ఉంటుంది. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతి సీజన్ లో తన బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకుంటారు. ఒక సందర్భంలో మైత్రి మూవీ మేకర్స్ తన మా బ్యానర్ నుంచి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి అనే రెండు సినిమాలను విడుదల చేశారు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు తన బ్యానర్ నుంచి రెండు సినిమాలను సిద్ధం చేసే పనిలోపడ్డాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజెర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read : Unstoppable with NBK S4 : బాలయ్య షోకు రామ్ చరణ్… అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఆహా.!
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారు అని అందరూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఆల్బమ్ కూడా మంచి హిట్ అయింది. గురు సినిమా తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో పాట పాడారు. ఈ పాట రిలీజ్ చేయడానికంటే ముందే మంచి హైప్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి వెనకాల విక్టరీ వెంకటేష్ నేను పాడుతాను నేను పాడుతాను అని రిక్వెస్టింగ్ గా అడుగుతూ తిరగడం అనేది చాలామందికి కామెడీగా అనిపించింది. ఈ ప్రోమో అంతటికి స్వాతిముత్యం సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా వాడారు. ఎట్టకేలకు ఈ పాట మంచి హిట్ అయింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ కానుంది. ఇక థియేటర్లో ఈ పాట ఎంత కిక్కిస్తుంది అనేది తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.