సినీ ఇండస్ట్రీలో అప్పుడే మార్పు మొదలైంది అనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే సినీ ఇండస్ట్రీలో సమస్యలను చెప్పుకోవడానికి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dil Raju)నేతృత్వంలో మొత్తం 36 మంది సెలబ్రిటీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో సెలబ్రిటీలు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచగా.. ఆయన బెనిఫిట్ షో మినహా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి కూడా కొన్ని షరతులు విధించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే సామాజిక బాధ్యతతో సెలబ్రిటీలు వ్యవహరించాలని, ఏదైనా మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం పూనుకుంటే దానిని ప్రచారం చేయాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిఖిల్ తన వంతు ప్రయత్నంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
పోస్ట్ నో ఈవిల్ అంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిఖిల్..
అసలు విషయంలోకెళితే.. సోషల్ మీడియా వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రచారంలో టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil) భాగమయ్యారు. పోస్ట్ నో ఈవిల్ (Post No Evil) గురించి చెబుతూ ఒక వీడియోని విడుదల చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని ఆయన కోరారు.. అందులో భాగంగానే..” మనం ఏదైనా వస్తువు కొనే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తాం.. కానీ సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసే ముందు అది నిజమా? కాదా? అని ఎందుకు చేసుకోవడం లేదు? ఎందుకంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం. కానీ మీరు సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొంతమంది జీవితాలను నాశనం చేస్తోంది. అందుకే మీరు ఏదైనా సరే ఒకరికి షేర్ చేసే ముందు దానిని పూర్తిగా తెలుసుకొని అది నిజమా? కాదా? అని ఒకసారి పరిశీలించండి” అంటూ తెలిపారు నిఖిల్. ఇక ప్రస్తుతం నిఖిల్ షేర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం..
ఇకపోతే..”సామాజిక మాధ్యమాలను మంచి కోసం వాడుదాం.. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం” అంటూ ఒక నినాదంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా “చెడు కనకు, చెడు అనకు, చెడు వినకు” అనే సూక్తి చాటి చెప్పే మూడు వానరాల బొమ్మలకు అదనంగా.. మరో వానరంను జత చేసి చెడు పోస్ట్ చేయకు (పోస్ట్ నో ఈవిల్) అంటూ ఈ హోర్డింగ్ లతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ఇమేజ్ లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు నగరంలోని అన్ని ప్రధాన ఏరియాలలో ఈ హోర్డింగ్ లు కనిపిస్తున్నాయి. అంతేకాదు పోస్ట్ నో ఈవిల్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా సెలబ్రిటీలు కూడా ఇలా తమ వంతు ప్రయత్నం చేయడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు సహకరించాలని, ప్రజలకు మంచి చేకూర్చేలా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
*Title:* Actor Nikhil urges us to make social media a positive experience!
*Description:*
Actor Nikhil urges us to make social media a platform for spreading positivity and encouragement!❌ Say NO to fake news and abusive behavior#PostNoEvil #CheduPostCheyavaddu… pic.twitter.com/JVlP4wrzzM
— AP Digital Corporation (@apdigitalcorp) December 30, 2024
శ్రీ లీల కూడా..
పోస్ట్ నో ఈవిల్ అంటూ యంగ్ బ్యూటీ శ్రీ లీలా కూడా తన వంతు ప్రయత్నం గా వీడియో షేర్ చేసింది.
Title: Actress Sree leela urges us to make social media a positive experience!
Description:
Actress Sree leela call for spreading positivity and building a supportive social media community!❌ Say NO to fake news and abusive behavior!#PostNoEvil #CheduPostCheyavaddu… pic.twitter.com/OYaZ3fd20H
— AP Digital Corporation (@apdigitalcorp) December 30, 2024
మద్దతుగా నిలిచిన అడివి శేష్..
ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద తప్పుగా కామెంట్ చేయడం కూడా తప్పే. దయచేసి దుష్ప్రచారాలను ఆపేద్దాం అంటూ కూడా పిలుపునిచ్చారు అడివి శేష్.
Title: Actor Adivi Sesh urges us to make social media a positive experience!
Description:
Actor Adivi Sesh urges everyone to make social media a positive and uplifting experience!❌ Say NO to fake news and abusive behavior#PostNoEvil #CheduPostCheyavaddu #PledgeToPostNoEvil pic.twitter.com/RBtVtKJej8
— AP Digital Corporation (@apdigitalcorp) December 30, 2024