Vikrant Massey : గుజరాత్ అహ్మదాబాద్ లో రెప్ప పాటులో జరిగిన విమాన ప్రమాదం వందల మంది ప్రాణాలను తీసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని లోటు ఏర్పడింది. ఈ ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.. ఈ విమాన ప్రమాదం ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఇంట తీవ్ర విషాదాన్ని మిలిల్చింది. ఆయనకు అత్యంత దగ్గర బంధువు ఈ విమాన ప్రమాదంలో మనించినట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని విక్రాంత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు..
హీరో విక్రాంత్ ఇంట విషాదం..
నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ప్రమాద ఘటనలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. సంతోషంగా కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పిన కొద్ది నిమిషాల్లో తిరిగిరాని లోకాలకు వెళ్లడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదం 12th ఫెయిల్ హీరో విక్రాంత్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. తన మామయ్య అయిన క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ మరణించాడని విక్రాంత్ తన బాధను వ్యక్తం చేశారు. విక్రాంత్ తన బంధువు మృతికి సంతాపం తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాలందరికీ తన సానుభూతిని తెలియజేశారు.. ఆయన పోస్టులో.. ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన ఊహించలేని విషాదం జరిగింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను చూసి నా హృదయం ముక్కలైంది. ఇక ఈ ఘటనలో మా మామ క్లిఫోర్డ్ కుందర్ తన కుమారుడు క్లైవ్ కుందర్‌ను కోల్పోయారని తెలిసి మరింత బాధగా ఉంది. ఆయన విమానంలో పనిచేస్తున్న మొదటి అధికారి అని పోస్టులో పేర్కొన్నాడు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు రిప్లై ఇస్తున్నారు.
విమాన ప్రమాదంలో 242 మంది..
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరి కుటుంబాల్లో తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. సుదూర ప్రయాణం కావడంతో ఇంధనం కూడా నిండుగా ఉండటం ప్రమాద తీవ్రత పెరగటానికి కారణమైందని తెలుస్తోంది. మధ్యాహ్నం 1.39 సమయంలో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. 300 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విమానం ఓ కాలేజ్ పై కూలిడంతో అభం శుభం తెలియని విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు.. ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.