OTT Movie : దాసన్ ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్. అతని రోజువారీ జీవితం ఒకేలా సాగుతూ, ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంటుంది. కానీ ఒక రోజు జరిగే అనూహ్య సంఘటన అతని ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఈ సంఘటన దాసన్‌ను సమాజంలోని అన్యాయాలు, అసమానతలు, నైతిక సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తాయి. ఈ సవాళ్ల మధ్య, దాసన్ తన కుటుంబాన్ని కాపాడగలడా? అతని సైకిల్‌తో ప్రయాణం, అతని జీవితాన్ని ఎలా మారుస్తుంది ? ఈ యాత్రలో అతను ఏ రహస్యాలను వెలికితీస్తాడు? ఈ సినిమా పేరు ఏమిటి ?ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
‘దాసేట్టన్టే సైకిల్’ కథ దాసన్ (హరీష్ పెరడి) అనే సెక్యూరిటీ గార్డ్ చుట్టూ తిరుగుతుంది. అతను కేరళలోని కోజికోడ్‌లో తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. . దాసన్ జీవితం ఒకేలా సాగుతూ, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఒత్తిడులతో నిండి ఉంటుంది. అతని రోజువారీ రొటీన్ లైఫ్ లో సైకిల్‌పై పనికి వెళ్లడం, గేట్ వద్ద నిలబడి డ్యూటీ చేయడం, ఇంటికి తిరిగి రావడం ఉంటాయి. అయితే ఒక అనూహ్య సంఘటనతో దాసన్ పరిస్థితి మారిపతుంది. ఈ సంఘటన దాసన్‌ను సమాజంలోని అన్యాయాలు, కులం, ఆర్థిక అసమానతలను ఎదుర్కొనేలా చేస్తుంది. అతని భార్య జయ, అతని సన్నిహితులు, ఈ సంఘటనలతో కలిసి ఉంటారు. దాసన్ పాత్ర సమాజంలో “సామాన్యుడు” ఎలా సవాళ్లను ఎదుర్కొంటాడో చూపిస్తుంది. దాసన్ వీటిని ఎదుర్కోవడానికి సైకిల్ యాత్రను ప్రారంభిస్తాడు. ఈ యాత్ర అతనికి గొప్ప అనుభూతిని ఇస్తుంది. చివరికి దాసన్ జీవితంలో జరిగే ఆ సంఘటన ఏంటి ? ఎందుకు అతను సైకిల్ యాత్ర చేస్తాడు ? అతని జేవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూస్ తెలుసుకోవాల్సిందే.
Read Also : ఓటీటీలోకి ఆర్నాల్డ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ … CIA ఏజెంట్ గా అవతారం … యాక్షన్ ప్రియులకి పండగే
ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘దాసేట్టన్టే సైకిల్’ (Dasettante Cycle). 2025 లో వచ్చిన ఈ సినిమాకు అఖిల్ కావుంగల్ దర్శకత్వం వహించారు. ఇందులో హరీష్ పెరడి, అంజన అప్పుకుట్టన్, వైధి పెరడి, కబని వంటి నటులు నటించారు. ఈ సినిమా హరీష్ పెరడి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు. 2025 మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు IMDbలో 4.5/10 రేటింగ్ ఉంది. ఇందులో హరీష్ పెరడి (దాసన్), అంజన అప్పుకుట్టన్ (ఇందిర), వైధి పెరడి (అఖిల్), కబని (వల్లి), అనుపమ (జయ), కాథల్ సుధి (షాజి), రత్నాకరన్ (పీఠాంబరన్), అఖిల్ కావుంగల్ (ఆనందు) వంటి నటులు నటించారు. ఏప్రిల్ 13 నుండి మనోరమా మాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, వ్యక్తిగత థీమ్‌లతో కూడిన ఒక ఫీల్ గుడ్ మూవీ.