Victory Venkatesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా కెరియర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ అద్భుతమైన పేరును సాధించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే తను మొదటి పని చేసిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా రాసేటప్పుడు ఆ స్క్రిప్టును స్రవంతి రవి కిషోర్ చాలా బలంగా నమ్మారు. అంతేకాకుండా ఒక సూట్ కేస్ లో పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. చాలామందికి నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి విపరీతమైన ఎలివేషన్ ఇస్తూ మాట్లాడేవారు స్రవంతి రవి కిషోర్. మొత్తానికి నువ్వు నాకు నచ్చావ్ సినిమా మొదలై రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వెంకటేష్ కెరియర్ లోనే మంచి హిట్ అయింది ఆ సినిమా. ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ మర్చిపోలేము. ప్రతి సంభాషణ కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది.
కలెక్టర్ అవ్వాలని కల
ముఖ్యంగా ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునేది విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్. ప్రతి డైలాగ్ కూడా ఒక పంచ్ లా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో వెంకటేశ్వర్లకి వాళ్ళ నాన్న అనకాపల్లి నుంచి రాసిన ఒక ఉత్తరం ఇంట్లో వాళ్లకి దొరుకుతుంది. అయితే ఆ హీరోయిన్ మరియు వాళ్ళ చెల్లి చదువుతారు. అప్పుడు తనకు చదువు అంటే ఎంత ఇష్టమో అని అక్కడికక్కడే ఒక కథ అల్లి వాళ్లతో చెబుతాడు విక్టరీ వెంకటేష్. ఆ డైలాగు వినగానే చాలామందికి విపరీతంగా నచ్చుతుంది. ఐఏఎస్ పాస్ అవుతాను, కలెక్టర్ అవుతాను అని చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఇప్పటికీ చాలామందికి విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది. డైలాగ్ చివర్లో మీరు ఖచ్చితంగా కలెక్టర్ అవుతారు బాబు అని సునీల్ చెప్పే డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
కల నిజమైన వేళ
వాస్తవానికి అది విక్టరీ వెంకటేష్ ఫన్నీగా చెప్పిన కూడా దానిని ఇప్పుడు ఏఐ నిజం చేసింది. రీసెంట్ టైమ్స్ లో టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలోనే విక్టరీ వెంకటేష్ కలెక్టర్ అయిపోవటం. చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండటం. బయట వాళ్ళ నాన్న వెయిట్ చేయటం. చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అంటూ విక్టరీ వెంకటేష్ పరుగులు తీయడం అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వీడియోను క్రియేట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి సైకిల్ మెకానిక్ అవుతా అనుకున్న వెంకటేశ్వర్లు ని కలెక్టర్ ను చేసేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
Finally,@VenkyMama కల AI నెరవేర్చింది… pic.twitter.com/hoTwQlLfQk
— thaNOs™ 🐺🇮🇳 (HHVM on Jun 12 🦅) (@Thanos_Tweetss) May 26, 2025