ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది. ఎంత సీక్రెట్ గా ప్రేమించుకుంటారో అంతే ఆర్భాటంగా పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇకపోతే పెళ్లికి దూరంగా ఉండే హీరోయిన్ల జాబితా కూడా ఎక్కువే. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరిపోయింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. తాజాగా జీవితంలో నేను వివాహం చేసుకోను అంటూ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
జీవితంలో పెళ్లి చేసుకోను..
తాజాగా ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. “నేను ఇకపై పెళ్లి అనే పదానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇదేదో ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయం కాదు. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో జంటలను చూశాను. ఒక జంట తప్ప మిగతా వాళ్లంతా రాజీ పడుతున్నారు. అయితే ఈ పెళ్లిళ్ల వల్ల చాలామంది వ్యక్తిగతంగా ఎదగలేకపోవడం కూడా నేను చూశాను. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను” అంటూ తెలిపింది ఐశ్వర్య లక్ష్మి. మొత్తానికైతే జీవితంలో పెళ్లి చేసుకోను అనే కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇదా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పాతికేళ్ల వయసు వచ్చేవరకు పెళ్లి కళలు కన్నా..
వాస్తవానికి పాతికేళ్ల వయసు వచ్చేవరకు పెళ్లి గురించి ఎన్నో కలలు కనిందట ఐశ్వర్య లక్ష్మి. గురువాయూర్ గుడిలో ఎన్నో పెళ్లిళ్లు చూసానని, అవి చూసిన ప్రతిసారి తాను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, అయితే పెద్దయిన తర్వాత.. పెళ్లి అసలు రూపం తనకు తెలిసిందని చెబుతోంది. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అయితే ఒక టైం లో మాట్రిమోనీ సైట్ లో నా సొంత డబ్బులతో నేను ప్రొఫైల్ కూడా పెట్టాను. కాకపోతే అది చూసి చాలా మంది ఫేక్ ప్రొఫైల్ అనుకున్నారు. కానీ పెళ్లి పై నా అభిప్రాయం కూడా మారిపోయింది అంటూ తెలిపింది ఐశ్వర్య లక్ష్మి.
ఐశ్వర్య లక్ష్మి సినిమాలు..
మొత్తానికి అయితే కొంతమంది వైవాహిక జీవితాలు చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.. కానీ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా జీవిస్తున్న వారిని కూడా ఒకసారి చూడండి. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పటికైనా మీ ఆలోచన మారుతుందేమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వయసు 34 ఏళ్లు. తనకు 29 ఏళ్ల వయసులోనే పెళ్లిపై క్లారిటీ వచ్చింది అని తెలిపింది. ఇకపోతే పెళ్లి విషయంలో తనను ఎవరు ప్రభావితం చేయలేదని కూడా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో సాయి దుర్గ తేజ్ (Sai Durga tej) హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది ఐశ్వర్య లక్ష్మి.
మట్టి కుస్తీ సినిమాతో భారీ గుర్తింపు..
ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఐశ్వర్య లక్ష్మి ‘మట్టి కుస్తీ’ సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది. ఇక ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమాలు చేస్తూ మరింతగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈమె నిర్ణయానికి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.