BigTV English

Asthma: చలికాలంలో ఆస్తమాను అదుపు చేయండిలా !

Asthma: చలికాలంలో ఆస్తమాను అదుపు చేయండిలా !

Asthma: చలికాలంలో ఆస్తమా రోగులు అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్‌లో వీరి చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. చల్లని గాలి , పొడి వాతావరణం ఆస్తమా లక్షణాలను మరింత పెరిగేలా చేస్తాయి. అందుకే ఈ సీజన్ లో ఆస్తమా ఉన్న వారు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇవి పాటిస్తే మాత్రమే చలికాలంలో కూడా హాయిగా ఉండవచ్చు.


ఆస్తమా ఉన్నవారు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమా రోగులు చలికాలంలో కూడా ఇబ్బంది పడకుండా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్తమా ఉన్న వారు తప్పకుండా పాటించాల్సిన 5 చిట్కాలు:


శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జలుబు వల్ల శరీరంలో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఉన్ని దుస్తులను ధరించండి. బయటకు వెళ్లే టప్పుడు తప్పకుండా స్వెటర్ వంటివి ఉపయోగించండి.

శరీరాన్ని కప్పుకోండి: చేతి తొడుగులు, సాక్స్ , టోపీలను తప్పకుండా ఉపయోగించండి. వీటి ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.

శ్వాసలో ఇబ్బంది :శీతాకాలంలో గాలి పొడిగా మారుతుంది. ఇది శ్వాసకోశంలో చికాకును కలిగిస్తుంది. అందుకే ఎక్కువ సేపు బయట తిరగకుండా ఉంటే మంచిది.

హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి:
మొక్కలు పెంచండి: ఇంట్లో కొన్ని మొక్కలు నాటండి. ఇవి గాలిలో తేమను పెంచడానికి సహాయపడతాయి.

సమయానికి మందులు తీసుకోండి:
మీ డాక్టర్ సూచించిన సమయానికి మందులు తీసుకోండి. ఇన్‌హేలర్‌ను ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి.

దుమ్మును నివారించండి:
దుమ్మును నివారించడానికి.. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. అంతే కాకుండా బెడ్‌లు , కర్టెన్‌లను క్రమం తప్పకుండా వాష్ చేయండి.

వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి: ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ వాడండి. దుమ్మును ముక్కులోకి వెళ్లకుండా మాస్క్ ధరించండి.

మరి కొన్ని చిట్కాలు:
వేడిగా ఉండే డ్రింక్స్ త్రాగండి: వేడి టీ, కాఫీ, తేనె కలిపిన వెచ్చని నీటిని తరుచుగా త్రాగుతూ ఉండండి.

వ్యాయామం: క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయండి.

ఒత్తిడిని తగ్గించండి: ఒత్తడి లేకుండా చూసుకోండి. ప్రశాంతంగా ఉండటం కోసం మ్యూజిక్ వినండి. లేదా ఇతర కార్యక్రమాలను నిర్వహించండి.

మద్యపానం: సిగరెట్ పొగకు దూరంగా ఉండండి. మీకు ఒక వేళ అలవాటు ఉన్న మానేయడానికి ప్రయత్నించండి.

ఆస్తమా ఉన్న వారు చల్లని గాలికి దూరంగా ఉండటం మంచిది. సిగరెట్ పొగకు కూడా దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండటానికి టైం కేటాయించండి. ఇన్హేలర్  తరుచుగా ఉపయోగించండి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి . సమయం ప్రకారం మందులను వాడండి. కాస్త అజాగ్రత్త కూడా అనేక సమస్యలకు దారి తీస్తుంది. అందుకే వీలైనంత వరకు ఆరోగ్యం పట్ల తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి.  అయినప్పటికీ తీవ్రత పెరిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×