Aishwarya – Abhishek:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ జంటలలో ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) జంట కూడా ఒకటి. వీళ్ళిద్దరూ ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి బంధానికి గుర్తుగా ఆరాధ్య కూడా జన్మించింది. ఇక ఇప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉన్న ఈ జంట మధ్యలోకి రూమర్స్ పెను తుఫానులా వచ్చాయి. ఐశ్వర్యరాయ్ కి , జయా బచ్చన్ కి మధ్య పొసగడం లేదని.. అటు భార్య, ఇటు తల్లి మధ్య అభిషేక్ బచ్చన్ నలిగిపోతున్నాడని, అందుకే ఐశ్వర్యరాయ్ కి దూరం కాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక అంతే కాదు విడాకులు అయిపోయాయి అని కూడా చాలామంది కామెంట్ చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఈ విడాకుల రూమర్స్ కి చెక్ పెడుతూ వచ్చిన ఈ జంట. ఇక నిన్న వీరిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నేడు షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మేము విడిపోలేదు అని చెప్పినా ఎవరు వినకపోయేసరికి.. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తమ కూతురితో కలిసి వీరు ముగ్గురు దిగిన ఫోటోలను ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎట్టకేలకు అందరికీ చక్కటి క్లారిటీ లభించిందని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇకనైనా ఈ జంటపై వస్తున్న రూమర్లు ఆగిపోతాయేమో చూడాలి.
ఐశ్వర్యారాయ్ – అభిషేక్ బచ్చన్ ప్రేమ, పెళ్లి..
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కంటే ముందే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తో ప్రేమలో పడింది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటూ వీరు ప్రేమాయణం కొనసాగించారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న సమయంలో.. సల్మాన్ ఖాన్ పెట్టిన టార్చర్ భరించలేక ఐశ్వర్యరాయ్ బ్రేకప్ చెప్పుకుందునే వార్తలు అప్పట్లో జోరుగా వినిపించాయి. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళిద్దరూ విడిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లకు కెరియర్ పైన ఫోకస్ పెట్టిన ఐశ్వర్య.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించింది. వీరిద్దరూ కలిసి ‘ధూమ్ 2’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడినట్లు సమాచారం. అలా 2007 జనవరి 14న నిశ్చితార్థం చేసుకున్న వీరు.. 2007 ఏప్రిల్ 20న వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశ, బెంగాలీ సాంప్రదాయాలకు కూడా తమ వివాహంలో పాటించడం జరిగింది. ముంబైలోని జహులో బచ్చన్ ఇల్లు ప్రతీక్షలో వీరి పెళ్లి జరిగింది.
ఐశ్వర్యరాయ్ సినిమాలు..
మాజీ ప్రపంచ సుందరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలోనూ..యాడ్లలో కూడా నటించింది. తన నటనతో ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈమె 2009లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిలో ఒకరిగా ఐశ్వర్య స్థానం దక్కించుకోవడం గమనార్హం.