Singer Pravasthi : తెలుగు సింగర్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏకైక షో పాడుతా తీయగా.. ఈ షో ద్వారా ఎంతో మంది సింగర్స్ తమ టాలెంట్ నిరూపించుకొని, ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇటీవలే ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్ ప్రారంభమైంది. దిగ్గజ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన ఈ షోని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్‌గా కొనసాగిస్తున్నారు.. అయితే ఈ షో వల్ల తనకు అన్యాయం జరిగిందని జూనియర్ సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఈ షో వల్ల ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో? అసలు ఆమె ఏమంటుందో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
పాడుతా తీయగా షోపై సింగర్ ప్రవస్తి ఆరోపణలు..
తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ సింగర్ బాలసుబ్రమణ్యం గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎంతోమంది సింగర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన మహనీయుడు బాలసుబ్రమణ్యం గారు.. కొత్త సింగర్స్ టాలెంట్ ని గుర్తించేందుకు పాడుతా తీయగా అనే షో ని ప్రారంభించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆ షో ద్వారా మళ్ళీ ఆయనను గుర్తు చేస్తున్నారు. ఆయన కొడుకు చరణ్.. ప్రస్తుతం పాడుతా తీయగా షో కి పోస్ట్ గా ఎస్పీ చరణ్ వ్యవహరిస్తున్నారు.. తాజాగా మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోపై సింగర్ ప్రవస్తి తాజాగా సంచలన కామెంట్స్ చేసింది.. ఆమెకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
Also Read: ఓటీటీలోకి నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి..
ఇటీవల ఈ షో నుంచి సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈమె పాటల గురించి అందరికి తెలుసు. ఆమె ఇప్పటివరకు పాడిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రవస్తి ఇంత త్వరగా షో నుంచి ఎలిమినేట్ అవడం ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇక తన ఎలిమినేషన్‌పై ప్రవస్తి రియాక్ట్ అవుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టులు పెడుతుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఏముందంటే..పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కి వెళ్లాలనుకుంటున్న సింగర్స్‌కి నా సలహా ఒక్కటే. ఏమైనా రికమండేషన్స్ లేదా జడ్జీల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే మాత్రమే షోలో పార్టిసిపేట్ చేయండి. ఆ రెండూ లేకుండా వెళ్తే మీకు అన్యాయం, మానసిక వేదన మాత్రమే ఎదురవుతాయి.. ఆ పోస్టులు చూస్తున్న కొంతమంది నెటిజన్లు ఆమెపై మండిపడుతూ రిప్లై ఇస్తున్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది సింగర్స్ తమ టాలెంట్ ను బయటపెట్టారు. ఎవరికీ ఎప్పుడు అన్యాయం జరిగినా పరిస్థితి కనిపించలేదు. నీలాంటి 100 మంది సింగర్లు ఇక్కడ వస్తుంటారు పోతుంటారు.. ఎవరు ఎప్పుడూ అన్యాయం జరిగిందని ఇలా అనలేదు నువ్వు మాత్రమే అంటున్నావు అంటే ఏమనుకోవాలి అంటూ నెటిజెన్స్ కామెంట్లతో ప్రవస్థిపై మండిపడుతున్నారు.. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రవస్తి టాపిక్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. మరి ప్రవర్తి వీడియోలపై ఆ షో నిర్వహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..