Vijay Devarakonda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది నటులుగా తమ కెరీర్ మొదలుపెట్టి తర్వాత హీరోలుగా కూడా తమకంటూ ఒక సొంత పేరును సంపాదించుకున్నారు. నవీన్ పోలిశెట్టి, శ్రీ విష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ వంటి హీరోలు అంతా కూడా ఒకప్పుడు చిన్నచిన్న పాత్రలు వేస్తూ ప్రూవ్ చేసుకున్నవాళ్లే. ఇక విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక స్టార్ డం క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో సినిమాలేవి ఆడకపోయినా కూడా ఇప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ అలానే ఉంది. దీని కారణం విజయ్ తన అభిమానులతో ఆఫ్లైన్లో కూడా బాగా ఉండటం. అలానే విజయ్ చేసిన కొన్ని పనులు ఎప్పటికీ విజయ్ ను హీరోగా నిలబెడుతూనే ఉంటాయి.
కలల కనడానికి భయపడకూడదు
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ తన సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తనకి ఇచ్చిన సినిమా ముత్తయ్య. అప్పుడెప్పుడో విడుదలైన ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సెకండ్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి అంటే ముందు “అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, కొంచెం పెద్దగా కలలు కనడానికి మీరు భయపడకూడదు” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. అలానే టీం అందరికీ విషెస్ తెలియజేశాడు.
Also Read : Fauji: ఈ భారీ బడ్జెట్ ప్రభాస్ కోసమా.? కథ మీద నమ్మకమా.?
ఆకట్టుకున్న సెకండ్ సాంగ్
సినిమా మీద విపరీతమైన ఇష్టం ఉన్న ఒక వృద్ధుడు కథ ఇది. ఒకసారైనా వెండి తెర మీద కనిపించి చనిపోవాలనుకునే వ్యక్తిత్వం తనది. ఈ సినిమా నుండి “సినిమాల యాక్ట్ జేసి” అనే పాటను విడుదల చేశారు ఈ సినిమాకి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటను చిన్న ఆలపించాడు. ఈ సినిమా దర్శకుడు భాస్కర్ మౌర్య ఈ లిరిక్స్ ను రాశారు. ఈ లిరిక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ” స్టెప్పులేసి ఎగిరి దుంకి చంపుతుంటవా, ఫేమస్ అవుతావా, గోళ్లు గిల్లుతావా, దేశమంతా లొల్లి చేస్తావా, డాన్స్ చేస్తావా, డైలాగ్ చెప్తావా” అని అర్థం వచ్చేలా ఉండే లిరిక్స్ ముత్తయ్య క్యారెక్టర్ ని తెలిపే విధంగా ఉన్నాయి. ఇక ఈ వీడియోలో కూడా ముత్తయ్య క్యారెక్టర్ రీల్స్ చేయడం గమనించవచ్చు. ఇక త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్ లో విడుదల కానుంది.
You must not be afraid to dream a little bigger despite all odds!
Happy to launch #CinemaLaActJeshi song from #Muthayya – https://t.co/0ZPwTpNEcb
Good luck to the whole team 🤗@BhaskharMaurya @vrindaprasad @thisisvamsik #KarthikRodriguez #DivakarMani @thesaimurali @crhemanth… pic.twitter.com/52ntYMFvSt
— Vijay Deverakonda (@TheDeverakonda) April 21, 2025