Summer Upcoming Movies:అసలే సమ్మర్ వచ్చేసింది. మరో రెండు రోజుల్లో పిల్లలకి కూడా హాలిడేస్ వస్తాయి. ఇక పిల్లలు హాలిడేస్ వచ్చాయంటే చాలు ఏదో ఒక వెకేషన్ కి వెళ్లాలని ఇంట్లో పెద్దలను విసిగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలైతే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు పిల్లలను ఇటు పెద్దలను దృష్టిలో పెట్టుకొని మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి పలు భాషా ఇండస్ట్రీలు కూడా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెల ఆఖరిలో ప్రేక్షకులను అలరించడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. కానీ ప్రత్యేకించి ఆ సినిమా మాత్రం అసలు మిస్ అవ్వకండి అని అటు సినీవర్గాలు కూడా చెబుతున్నారు. మరి ఆ సినిమాలేంటి? ఏ సినిమా మిస్ అవ్వకూడదు..? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
చౌర్య పాఠం..
దొంగతనం చేయడానికి ఉపయోగపడే ట్రిక్ కాదు.. అవసరం కోసం దొంగతనం చేయాల్సి వస్తే.. అప్పుడు కథానాయకుడు ఏం పాఠం నేర్చుకుంటాడు.. అనే కథాంశమే ఈ చిత్రం అని అంటున్నారు ఇంద్ర రామ్. ఈయన కీలక పాత్రలో నటించగా.. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన (Trinatha Rao Nakkina) నిర్మించారు. ఏప్రిల్ 18వ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అదే రోజు కళ్యాణ్ రామ్ (Klayan Ram) ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, సుమయా రెడ్డి (Sumaya Reddy) ‘డియర్ ఉమ’, తమన్నా(Tamannaah ) ‘ఓదెలా 2’ సినిమాలు పోటీ పడడంతో ఇక తమ చిన్న సినిమాను ఎవరు చూస్తారు అనే నేపథ్యంలో ఏప్రిల్ 25 కి వాయిదా వేశారు. చిన్న సినిమాని అయినా సరికొత్తగా ఉండబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు మాత్రం మిస్ అవ్వకండి అని ఇప్పటికే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ త్రినాథరావు తెలిపిన విషయం తెలిసిందే.
సారంగపాణి జాతకం..
విభిన్నమైన చిత్రాలతో.. ఊహించని కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రియదర్శి (Priyadarshi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈసారి చాలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే కోర్ట్ (Court) సినిమాతో ఆకట్టుకున్న ప్రియదర్శి.. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ఈ సినిమాలో రూపా కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మనిషి భవిష్యత్తు అతడి చేతి రేఖల్లోనే ఉంటుందా.? లేక అతడి చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకి సమాధానంగా రూపొందుతున్న చిత్రమే ఇది. తన నమ్మకాలు, తను ఇష్టపడిన అమ్మాయితో ప్రేమ మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడి కథతో ఈ సినిమా రాబోతోంది. చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా సాగుతుందని దయచేసి ఈ సినిమాను మాత్రం ఆడియన్స్ థియేటర్లలో మిస్ అవ్వకండి అని అటు సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
గ్రౌండ్ జీరో..
ఇమ్రాన్ హస్మి , సాయి తమంకర్, జోయా హుస్సేన్, ముఖేష్ తివారి తదితరులు కీలకపాత్రలో నటించిన చిత్రం ‘గ్రౌండ్ జీరో’. యాక్షన్ మిలిటరీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి తేజస్ ప్రభా విజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శివ శంభో:
సుమన్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ శివ శంభో కూడా ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది.
జింఖానా..
ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటుడు నస్లేన్ కే గఫూర్. ఖలీదు రెహమాన్ దర్శకత్వంలో జింఖానా అనే సినిమాతో రాబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. ఇందులో నస్లేన్ తెలుగు డైలాగ్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక వీటితోపాటు సూర్యాపేట జంక్షన్ కూడా ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది.
Also Read:Ajith Kumar: రేర్ ఫీట్ సాధించిన అజిత్ కుమార్… దీని కోసమే రెండు సార్లు ప్రమాదం..!