Aishwarya Rajesh : ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh).. కలర్ లేకపోయినా తన నటనతోనే ఎంతోమందిని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట్లో ఈమెని తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవానికి ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు దివంగత ప్రముఖ నటుడు రాజేష్ (Rajesh) కూతురు. అలా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చినప్పటికీ తెలుగు వాళ్ళు ఆదరించకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అయితే తమిళ ఇండస్ట్రీలో కలర్ ని చూడరు. యాక్టింగ్ నే చూస్తారు కాబట్టి అలా తమిళ ఇండస్ట్రీ ఐశ్వర్య రాజేష్ కి బ్రహ్మ రథం పట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తమిళ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.
అలా ఎప్పుడైతే తమిళంలో ఫేమస్ నటిగా ఐశ్వర్యా రాజేష్ కి పేరు వచ్చిందో, అప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఐశ్వర్య ని గుర్తించారు. అలా తెలుగులో కూడా అవకాశాలు ఇచ్చారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బడా హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ భార్య పాత్రలో అదరగొట్టేసినట్టు సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.
పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావు..
అయితే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఎక్కువ బజ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు క్రైమ్ కథాంశంతో అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వెంకటేష్ మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదలవబోతుండడంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ కి పెళ్లికి సంబంధించిన ప్రశ్న యాంకర్ నుండి ఎదురైంది. యాంకర్ మాట్లాడుతూ.. మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా..! ఎందుకు చేసుకోవట్లేదు అని అంటే.. ?.. “పెళ్లి చేసుకుంటే సినిమాల్లో ఆఫర్స్ రావు. పెళ్లి చేసుకోకుండా ఉంటే నాలుగు సినిమాల్లో ఆఫర్స్ అయినా వస్తాయి” అని చెప్పింది. మీరు పెళ్లి చేసుకున్నాక నాలుగు కాదు 40 సినిమాల్లో చేయొచ్చు కదా అని యాంకర్ అడగగా.. పెళ్లయ్యాక జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. “పెళ్లయ్యాక నా భర్త నువ్వు సినిమాలు మానేసి ఇంట్లోనే ఉండు.. నేను సంపాదిస్తా అంటే ఏం చేసేది.. ? అందుకే పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేస్తున్నాను” అని చెప్పింది. అయితే ఇది విన్న నెటిజన్స్.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అవకాశాల కోసం కూర్చుంటే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందేమో అంటూ ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు..
పెళ్లిపై అలాంటి అభిప్రాయాన్ని చెప్పిన ఐశ్వర్య..
అదే యాంకర్ మరొకసారి మాట్లాడుతూ.. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత.. సినిమాల్లో చేయమని చెప్పే భర్త దొరకొచ్చు కదా అంటే.. అలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇక తమిళ్ అబ్బాయి అయినా పర్వాలేదు. తెలుగు అబ్బాయి అయినా పర్వాలేదు.. ఎవరైనా సరే సంతోషంగా పెళ్లి చేసుకుంటాను అంటూ ఐశ్వర్య రాజేష్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఐశ్వర్యా రాజేష్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పెళ్లయి పిల్లలు ఉన్న వారికి కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. పెళ్లయిందా?కాలేదా? అని కాదు యాక్టింగ్ ఎలా ఉంది..అందరినీ ఎలా మెప్పించగలుగుతున్నారు అనేది మాత్రమే చూస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.