Mega Vs Allu : గత కొన్నాళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా జరిగిన సంధ్య థియేటర్ వివాదంతో ఈ రెండు కుటుంబాల మధ్య అంతా చక్కబడినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేదా మెగా ఫ్యామిలీకి చెందిన ఒక్క హీరో కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ తాజాగా పలు వేర్వేరు ఈవెంట్లలో ఒకవైపు పవన్, మరోవైపు చిరు చేసిన కామెంట్స్ ని కాస్త గమనించి చూస్తే… అవి అల్లు అర్జున్ (Allu Arjun)ను ఉద్దేశించి చేసినవేనా? అనే అనుమానం రాక మానదు.
చిరంజీవి ఏమన్నారంటే?
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఆప్త బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan), నా ఫ్యామిలీలోని నా బిడ్డలందరూ నా అచీవ్మెంట్” అని చెప్పారు. ఆ తర్వాత చిరు మాట్లాడుతూ “టాలెంట్ ఉంటే సరిపోదు వ్యక్తిత్వం ఉండాలి. మనలాంటి నటీనటులు చాలామంది ఉంటారు. మనం కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కాకపోతే ఇంకా వేరు వేరొకరు… టాలెంట్ ఉంది కదా, సక్సెస్ ఉంది కదా అని ఎగిరితే, కాలర్ ఎగరేస్తే మన ప్రవర్తన నచ్చక అందరూ మనల్ని దూరం పెట్టేస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నిర్మాతల మంచి గురించి ఆలోచించాలి. కానీ ఉన్నవారిలో మనం బెస్ట్ అనిపించుకోవాలంటే టాలెంట్ తో పాటు మన వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం” అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ బన్నీని ఉద్దేశించేనని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే…
మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి రాజమండ్రిలో జరగగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘అసలైన గేమ్ ఛేంజర్ రామ్ చరణ్’ అంటూ చెర్రీని ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా “మనం ఎంత ఎత్తుకు ఒదిగినా మూలాలను మర్చిపోకూడదు. చిరంజీవి గారి వల్లే మేమంతా ఈ స్టేజ్ లో ఉన్నాము. ఆయనే మాకు స్ఫూర్తి” అంటూ వరుసగా పవన్ కళ్యాణ్ కౌంటర్లు వేశారు.
బన్నీనే ఇద్దరి టార్గెట్?
మొత్తానికి అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ టైం చూసి కొట్టారని, అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కౌంటర్ వేశారని ప్రచారం జరుగుతుంది. చరణ్ కూడా తక్కువేమీ తినలేదు. తన బాబాయ్ ను నిజమైన గేమ్ ఛేంజర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇలా మెగా హీరోలు అంతా టైమ్ దొరికితే చాలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ బన్నీని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. దానికి తగ్గట్టుగానే ‘పుష్ప 2 స్టేజ్ పై అల్లు అర్జున్ చేసిన ఓవర్ యాక్షన్ వర్సెస్ చిరు, పవన్ సెటైర్లు అంటూ మీమ్స్ ను ఓ రేంజ్ లఓ ట్రోల్ చేస్తున్నారు. ఇక ‘పుష్ప 2’ వివాదం తరువాత పలువురు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ నడవడికపై మండి పడిన సంగతి తెలిసిందే.