Aishwarya Rajesh:సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు. కానీ ఇప్పటి జనరేషన్లో అదృష్టం మాత్రం ఉంటే సరిపోదు. ఎలాంటి పాత్రలోనైనా నటించగలగాలి, పొట్టి బట్టలు వేసుకోగలగాలి, ఎక్స్పోజింగ్ చేయగలగాలి, గ్లామర్ రోల్స్ చేయాలి ఇలా అయితేనే అవకాశాలు ఇస్తున్నారు. ఇక ఇలాంటి వాటికి ఒప్పుకోకపోతే ఆ హీరోయిన్లకు నో ఛాన్స్ అని మొహం మీదే చెప్పేస్తున్నారు.అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఈ హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh ).. అదేంటి ఈ మధ్యనే సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో అతిపెద్ద హిట్ కొట్టింది. అలాంటిది ఈ హీరోయిన్ కి అవకాశాలు లేకపోవడం ఏంటి అని ? చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా ఇదే నిజం. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ కి ప్రస్తుతం చేతిలో ఒక్క అవకాశం కూడా లేదు. అది కూడా తెలుగులో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఐశ్వర్యకి నో ఛాన్స్ అంటున్నారు డైరెక్టర్లు. మరి టాలీవుడ్ డైరెక్టర్లు ఎందుకు అలా అంటున్నారో ఇప్పుడు చూద్దాం.
మీనాక్షికి వరుస అవకాశాలు.. మరి ఐశ్వర్య పరిస్థితి ఏంటి..?
ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పేరుకు తెలుగు హీరోయినే కానీ తెలుగులో ఏమాత్రం గుర్తింపు లేని నటి అని చెప్పుకోవచ్చు.ఈ హీరోయిన్ కి తెలుగులో కంటే తమిళ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ లోనే ఈమెకు మంచి మంచి సినిమాలు పడ్డాయి. తమిళ డైరెక్టర్లే అవకాశాలు ఇచ్చారు. అయితే మన తెలుగులో ఎక్కువగా గ్లామర్ చూస్తారని కానీ తమిళంలో అలా కాదు అని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అయితే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కి కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. వాస్తవానికి ఏ పాత్ర ఇచ్చినా సరే అందులో నటించగల దిట్ట ఆమె. కానీ మన తెలుగు దర్శకులు మాత్రం ఇతర ఇండస్ట్రీల హీరోయిన్లకే ఎక్కువ ప్రియార్టీ ఇస్తారు అనే టాక్ ఎప్పటినుండే ఉంది. తెలుగు హీరోయిన్లను ఎక్కువగా తీసుకోరు అని ఇప్పటికే చాలామంది తెలుగు నటీమణులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటివారిలో ఐశ్వర్య రాజేష్ కూడా చేరిపోయింది..ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం (Sankrantiki Vasthunnam) వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో సినిమాలు లేవు. ఈ సినిమాలో వెంకీ ప్రియురాలు పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) కి చేతినిండా అవకాశాలు ఉన్నాయి. ఇక మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ సినిమాలను రిజెక్ట్ కూడా చేస్తోందట.
తెలుగు దర్శకులు ఐశ్వర్యను అందుకే దూరం పెడుతున్నారా..?
కానీ అదే సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ కి మాత్రం ఒక్క అవకాశం కూడా తెలుగులో లేదు. దానికి కారణం మన టాలీవుడ్ డైరెక్టర్లే అంటున్నారు. ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ పొట్టి పొట్టి షాట్లు వేసుకొని హీరోలకు ముద్దులు ఇస్తూ ఎక్స్పోజింగ్ పాత్రల్లో చేయమంటే చేయదు. కానీ టాలీవుడ్ లో మాత్రం అలాంటి పాత్రలు చేసే హీరోయిన్లనే ఎక్కువగా తీసుకుంటారు. ఐశ్వర్య రాజేష్ కి భాగ్యం వంటి మంచి పాత్ర వస్తే ఆమె అందులో ఒదిగిపోతుంది. కానీ ఇలాంటి పాత్రలు సీనియర్ హీరోల సినిమాల్లో తప్ప యంగ్ హీరోల సినిమాల్లో ఉండవు. అందుకే ఐశ్వర్య రాజేష్ సీనియర్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు పెద్ద హీరోల సినిమాల్లో భాగ్యం వంటి పాత్రలు రావడం కోసం ఐశ్వర్య రాజేష్ వెయిట్ చేయాల్సిందే అని భావిస్తున్నారు. ఇక హిట్టు వచ్చినా కూడా ఐశ్వర్య రాజేష్ కి అవకాశం ఇవ్వడానికి టాలీవుడ్ లో ఎవరూ ముందుకు రారు అని, సీనియర్ హీరోలకు అయితేనే ఈమెను తీసుకుంటారని, గ్లామర్ రోల్స్ కి ఐశ్వర్య పనికి రాదు అని డైరెక్టర్లు అనుకోవడం వల్లే మన తెలుగు హీరోయిన్ కి అవకాశాలు రావడం లేదు అని చాలామంది తెలుగు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఐశ్వర్య రాజేష్ మళ్లీ అనిల్ రావిపూడి(Anil Ravipudi) వంటి డైరెక్టర్లు ఇచ్చే పాత్రల కోసం వెయిట్ చేయాల్సిందే.