AP Registration Charges: ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. గత ప్రభుత్వ హయంలో అడ్డగోలుగా పెంచిన విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలు తగ్గించగా.. మరికొన్ని చోట్ల పెంచారు. మరికొన్ని చోట్ల యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఏపీలో ఇవాళ్టి నుంచి భూ రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 10 నుంచి 20 శాతం, పట్టణాల్లో 15 నుంచి 30 శాతం వరకు పెంపుదల ఉండనుంది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు గత రెండు రోజుల నుంచి భారీగా క్యూ కట్టారు. ఈ రెండు రోజులు కలిపి దాదాపు రూ.220 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. ఇక భారీగా ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో.. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేయడంతో సర్వర్లు మొరాయించాయి. ఛార్జీల పెరుగుదలతో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని రెండు రోజులు అర్థరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఏలూరు జిల్లా నూజివీడులో కూడా రాత్రి పదిన్నర వరకు రిజిస్ట్రర్ ఆఫీస్ కిటకిటలాడింది. నూజివీడు సబ్ రిజిస్టర్ పరిధిలో 10 నుంచి 30 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువ పెరగనుంది. దీంతో నిన్నే ఎక్కువమంది రిజస్ట్రేషన్లు చేసుకున్నారు.
ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు మొదలైంది. నేటి నుంచే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అములోకి రానున్నాయి. 40 నుంచి 50 శాతం వరకు ఛార్జీల బాదుడు ఉండబోతోందని సమాచారం. అమరావతికి మాత్రం బాదుడు నుంచి మినహాయింపు లభించింది. అమరావతి విలువ పెరగలేదని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ క్రమంలో అన్ని చోట్ల పెంచి.. అమరావతికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గి, అమరావతిలో పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
Also Read: ఇక నేరుగా అసెంబ్లీకి.. ఈసారి మారం చేయకుండానే..
భూములతో పాటు నిర్మాణాల విలువ పెంచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జాయింట్ కలెక్టర్ల కమిటీలు కూడా ఆమోదం తెలిపాయి. నివాస, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల విలువ భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలతో.. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 14250 రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఒక్కరోజే 107.78 కోట్ల రూపాయల ఆదాయం లభించనుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184 రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ప్రతిరోజు 8 వేల రిజిస్టేషన్లు జరిగే అవకాశాలున్నట్టు అధికార యంత్రాంగం తెలుపుతోంది.