BigTV English

VenkyAnil3: ఎక్స్ కాప్ కు ఎక్సలెంట్ వైఫ్ దొరికేసింది..

VenkyAnil3: ఎక్స్ కాప్ కు ఎక్సలెంట్ వైఫ్ దొరికేసింది..

VenkyAnil3: విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే రెండు హిట్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వెంకీ మామకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టాయి. ఇక వీరి కాంబోలో మూడో సినిమా రానుంది. ఈ ఏడాది ఉగాది పర్వదినాన వెంకీ- అనిల్ కాంబో రిపీట్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.


ఎక్సలెంట్ వైఫ్/ఎక్స్ కాప్/ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ పోస్టర్ పై రాసుకొచ్చి.. సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇదొక ట్రయాంగిల్ క్రైమ్ కథగా తెరకెక్కుతోందని సమాచారం. జూలై 3 న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది.

తాజాగా ఈ సినిమాలో ఎక్సలెంట్ వైఫ్ ను పరిచయం చేశారు. ఇందులో ఎక్సలెంట్ వైఫ్ గా అందాల భామ ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చీరకట్టులో.. అచ్చతెలుగు గృహిణిగా ఐశ్వర్య కనిపించింది. పక్కనే గన్, దానిమీద తాళిని చూపించారు. ఐశ్వర్య రాజేష్.. మొట్టమొదటిసారి సీనియర్ హీరో పక్కన నటిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.


ఇక ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ను అనౌన్స్ చేస్తారో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా కాకుండా వెంకటేష్.. రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సిరీస్ సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి మొదటి సీజన్ తో విమర్శలకు గురైన వెంకీ మామ.. ఈ సీజన్ తో మంచిపేరును తెచ్చుకుంటాడేమో చూడాలి.

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×