BigTV English

Aishwarya Rajesh: కామాఖ్య దేవాలయంలో భాగ్యం ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్..!

Aishwarya Rajesh: కామాఖ్య దేవాలయంలో భాగ్యం ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్..!

Aishwarya Rajesh:ప్రస్తుతం సమ్మర్ కావడంతో చాలామంది నటీనటులు సమ్మర్ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నటీనటులు ఫ్యామిలీస్ తో వెకేషన్లు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొంతమంది సెలబ్రెటీలు ఫ్రెండ్స్ తో మరికొంతమంది బాయ్ ఫ్రెండ్,గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో వెకేషన్ లకి వెళ్తూ సమ్మర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లు చాలామంది లవర్లను మెయింటైన్ చేస్తూ రొమాంటిక్ ప్లేస్ లకి వెకేషన్ లకి వెళ్తే ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).. తాజాగా ఐశ్వర్య రాజేష్ తన స్నేహితులతో కలిసి టెంపుల్ కి వెళ్లిన ఫోటోలను షేర్ చేసుకుంది. మరి ఇంతకీ ఐశ్వర్య రాజేష్ ఎక్కడికి వెళ్లింది.. ఇలా సడన్గా భక్తి బాట పట్టడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


ఆధ్యాత్మిక బాట పట్టిన ఐశ్వర్య రాజేష్

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ ఏడాది భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఐశ్వర్య రాజేష్ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఐశ్వర్య రాజేష్ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తెలుగు దర్శకులు ఎవరు ఈమెను పట్టించుకోవడం లేదు. కానీ అనిల్ రావిపూడి చేతిలో పడి భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన స్నేహితులతో కలిసి అస్సాంలో ఉండే కామాఖ్య టెంపుల్ కి వెళ్ళింది.అంతే కాదు అక్కడ స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ “జై మా కామాఖ్య” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.


కామాఖ్య దేవాలయంలో దర్శనమిచ్చిన ఐశ్వర్య రాజేష్..

నీ ఏజ్ లో ఉన్న హీరోయిన్లందరూ లవర్ లని పట్టుకొని రొమాంటిక్ ప్లేస్ లకి వెకేషన్ కి వెళ్తే.. నువ్వేమో స్నేహితులతో కలిసి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నావా అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇంకొంతమందేమో వేణు స్వామిని ఏమైనా కలిసావా.. ఆయనతో జాతకం చెప్పించుకొని కామాఖ్య టెంపుల్ కి వెళ్ళావా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఐశ్వర్య రాజేష్ తల్లి మంచి సంబంధం దొరికితే పెళ్లి చేస్తాం అని చెప్పింది. కాబట్టి పెళ్లికి సంబంధించి ఏదైనా దోషం ఉంది కావచ్చు.అందుకే ఇలా కామాఖ్య టెంపుల్ కి వెళ్లి పూజలు చేసింది అంటూ ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కామాఖ్య టెంపుల్ కి తమ సినీ కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని మరిన్ని ఆఫర్స్ రావాలని వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఇలా టెంపుల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Abhishek Bachchan : ఎస్బీఐతో అభిషేక్ భారీ డీల్… నెలకు లక్షల్లో ఆదాయం..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×