Abhishek Bachchan :బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishesk Bachchan) జంట కూడా ఒకటి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విడాకుల రూమర్లు వస్తున్నాయి. ఈ జంట ఎప్పటికప్పుడు ఆ రూమర్స్ కి చెక్ పెడుతూనే వస్తోంది. దీనికి తోడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా తాను తన భర్తతో కలిసే ఉన్నాను అంటూ ఇంటి కూడా ఇచ్చింది ఐశ్వర్యరాయ్. అయినా సరే వీరిద్దరిపై వస్తున్న రూమర్లు మాత్రం ఆగలేదు. ఇకపోతే అభిషేక్ బచ్చన్ అటు సినిమాలతో పాటు వివిధ స్పోర్ట్స్ టీమ్లలో కూడా పార్టనర్ గా బిజీగా గడుపుతున్నారు. వీటి నుంచి కొంత ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. మరొకవైపు ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల అభిషేక్ బచ్చన్ ఖాతాలో సుమారుగా రూ.19 లక్షలు జమ చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? అంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎస్బిఐ ద్వారా అభిషేక్ ఖాతాలో ప్రతినెల రూ.19 లక్షలు..
ఇక అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ బిగ్ బీ గా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసి ఆస్తులు సంపాదించిన ఈయన తన సంపాదనను వృధా ఖర్చు చేయకుండా తన వారసత్వానికి ఉపయోగపడేలా పెట్టుబడులు కూడా పెట్టారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పై కొడుకు అభిషేక్ తో కలిసి ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. బిగ్ బి సొంత నివాసం జల్సా బంగ్లాకు సమీపంలోనే రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వత్స, అమ్ము అనే బంగ్లాలను కట్టారు. ఈ బంగ్లాలోని గ్రౌండ్ ఫ్లోర్లను ఇప్పుడు లీజు కి ఇవ్వడం జరిగింది. ఈ రెండు గ్రౌండ్ ఫ్లోర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి లీజు కి ఇచ్చారు. ఇక ఈ రెండింటికి కూడా ఎస్బిఐ 18.9 లక్షల రూపాయలను నెలవారీ అర్ధరూపంలో చెల్లిస్తోంది. అంతేకాదు లీజు అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వీటి అద్దె 25% పెంచేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎస్బిఐ, బచ్చన్ ఫ్యామిలీ మధ్య 15 ఏళ్లకు అగ్రిమెంట్ ఫిక్స్ అయిందని, మొదటి ఐదేళ్ల గడువు పూర్తయితే తర్వాత నెల నుంచి అభిషేక్ ఖాతాలో రూ.24 లక్షలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అభిషేక్ – ఐశ్వర్య పెళ్లి ప్రయాణం..
ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ జర్నీ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో ఫస్ట్ సినిమా ‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వచ్చింది. 2006లో ‘ఉమ్రావో జాన్’ సినిమాతో మరొకసారి వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ క్లోజ్ అయినట్లు అభిషేక్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే 2007లో గురు సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్.. ఐశ్వర్య కి ప్రపోజ్ చేయగా.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 2011లో వీరికి ఆరాధ్య అనే అమ్మాయి కూడా జన్మించింది.
ALSO READ:Vishnupriya: ఇలా కూడా ఉంటారా.. ఇండస్ట్రీ ఎంట్రీపై స్టోరీ చెప్పిన విష్ణు..!