BigTV English

Decoit Movie: అడవి శేషు మూవీ రికార్డ్ .. రిలీజ్ కు ముందే కోట్ల లాభం..

Decoit Movie: అడవి శేషు మూవీ రికార్డ్ .. రిలీజ్ కు ముందే కోట్ల లాభం..

Decoit Movie: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచి ఇప్పటివరకు ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో తెలుగు ఆడియన్స్ మనసులో చోటు సంపాదించుకున్నాడు. నటుడిగానే కాకుండా ముందుగానే రైటర్ గా ఆడియెన్స్ నుంచి నూటినూటి మార్కులు పొందారు.. తన రైటింగ్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. యాక్టింగ్, యాక్షన్ స్కిల్స్ ను కూడా జత చేసి ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అడివి శేష్ నుంచి రాబోతున్న నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు రాబోతుంది. ఆ సినిమా రిలీజ్ కు ముందే రికార్డు బ్రేక్ చేసింది. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


అడవిశేషు మూవీ బడ్జెట్..

హిట్ 2 మూవీలో అడవి శేషు నటించాడు. ఆ మూవీ యాక్షన్ సీక్వెల్ గా వచ్చింది. భారీ విజయాన్ని అందుకోవడం తో పాటుగా.. ప్రస్తుతం ఈ హీరో డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రూ.70 కోట్ల వరకు ఈ సినిమాకు బడ్జెట్ పెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, హిందీలో ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడానికి ఇంకాస్తా సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది.


భారీ ధరకు మూవీ రైట్స్..

అడవి శేషు మూవీలకు మామూలుగానే డిమాండ్ ఉంటుంది. ఆయన ఎంపిక చేసుకునే కథల కారణంగా అడివి శేష్ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ కారణంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ’ చిత్రంపై భారీ హైప్స్ నెలకొన్నాయి.. సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ రూ.8 కోట్లతో కొనుగోలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజం చెప్పాలంటే ఈయన లైఫ్ లో ఇంత బడ్జెట్ తో సినిమా కొనుగోలు చేసినట్టు లేదు.. ఈ మూవీ రైట్స్ విషయంలో మాత్రం సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది..

Also Read : హమ్మయ్య.. ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ‘రాజా సాబ్ ‘.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా..

రిలీజ్ ఎప్పుడంటే..? 

భారీ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న డెకాయిట్ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రలో అలరించబోతున్నారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చెయ్యనున్నారు. ఇక అడవి శేష్ చిత్రాలకు మంచి కలెక్షన్లు కూడా వస్తుంటాయి. ఇక గతంలో వచ్చి గుఢాచారి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. ఆ చిత్రానికి సీక్వెల్ గా G2ను కూడా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. మరి త్వరలోనే ఈ మూవీ గురించి కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం… ఏది ఏమైన ఈ హీరో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×