BigTV English
Advertisement

Aishwarya _Danush: మళ్ళీ ఒక్కటైన ఐశ్వర్య ధనుష్…. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా!

Aishwarya _Danush: మళ్ళీ ఒక్కటైన ఐశ్వర్య ధనుష్…. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా!

Aishwarya _Danush: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా బ్రేకప్ కూడా చెప్పుకుంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకొని విడిపోగా, మరి కొంతమంది పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన వారిలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush)ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth)జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో గత 20 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక వీరిద్దరూ 18 సంవత్సరాలు పాటు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు.


మంచి తల్లిదండ్రులుగా…

తన కుటుంబంతో సంతోషంగా ఉన్న ఈ హీరో ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు అనుకూలంగానే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటిస్తూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇలా 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఇద్దరు విడిపోవడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ ఇద్దరు తిరిగి కలిస్తే బాగుంటుందని అందరూ భావించారు. ఇక ఇటీవలే వీరికి చట్టపరంగా విడాకులు(Divorce) కూడా మంజూరైన విషయం తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ మంచి స్నేహితులకు మాత్రం కొనసాగుతామని అలాగే తన పిల్లలకు మంచి తల్లితండ్రులుగా ఉంటామని వెల్లడించారు.


కొడుకు కోసం ఒక్కటిగా..

ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈ జంట తరచూ కలిసి కనిపిస్తూ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. తాజాగా మరోసారి ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే వీరిద్దరూ కలిసింది తన కొడుకు కోసమని తెలుస్తోంది. ధనుష్ ఐశ్వర్యల పెద్ద కుమారుడు యాత్ర స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ హాజరు అయ్యారు. తన కొడుకు గ్రాడ్యుయేషన సందర్భంగా స్కూల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ హాజరుకావడమే కాకుండా తన కొడుకును ఇద్దరు హగ్ చేసుకుని ఉన్నటువంటి ఫోటోలను స్వయంగా ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇలా పిల్లల కోసం కాకుండా ఎప్పటిలాగే అందరూ ఒక్కటైతే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని తన కొడుకు కోసం జంటగా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి గ్రాడ్యుయేషన్స్ సందర్భంగా ఇద్దరు కలిసి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధనుష్ నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఐశ్వర్య తిరిగి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక ధనుష్ కూడా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ నటుడిగా, నిర్మాతగా బిజీ అయ్యారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×