Aditi Shankar : అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సాధించుకుంది. ఈ సినిమాకి కథను బాబి అందించాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాసును హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత చేసిన స్పీడున్నోడు సినిమా పర్లేదు అనిపించుకుంది ఆ తర్వాత చేసిన జయ జానకి నాయక సినిమా మంచి హిట్ అనిపించింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు.
థియేటర్లో కంటే యూట్యూబ్ లోనే ఎక్కువ
కవచం, సీత, రాక్షసుడు, సాక్ష్యం వంటి సినిమాలు అంతంత మాత్రాన్ని ఫలితాన్ని తీసుకొచ్చాయి. శ్రీనివాస్ చేసిన సినిమాలు థియేటర్లో కంటే యూట్యూబ్ లోనే ఎక్కువ ఆదరణను సాధించాయి. నార్త్ లో అయితే యూట్యూబ్లో ప్రతి సినిమా కూడా కొన్ని మిలియన్ న్యూస్ దాటింది. ఈ సందర్భంగా నార్త్ లో కూడా ఫలితాన్ని సాధించాలని ఉద్దేశంతో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో నిర్మించారు. ఈ సినిమా అక్కడ ఊహించిన ఫలితాన్ని అందించలేదు. ఛత్రపతి సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ని ఒక కొత్త స్టార్ గా ఎదిగేలా చేసింది. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ లెవెల్ కూడా మారిపోయిందని కొంతమంది చెబుతూ ఉంటారు.
అందుకే నేను అతనిని బెల్లం గారు అని పిలుస్తా
విజయ్ కనకమేడల దర్శకత్వంలో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన సినిమా బైరవం. మే 30ని విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాతో ముగ్గురు హీరోలు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది నటించారు. ఈ సినిమాకి సంబంధించి అదితి శంకర్ ఎక్కువ ప్రెస్ మీట్ లో కనిపించడం మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో చాలాసార్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను బెల్లం గారు అనడం మొదలుపెట్టారు అదితి. అయితే దీని గురించి క్లారిటీ కూడా ఇచ్చారు. మామూలుగా అతను చాలా స్వీట్ అందుకనే నేను అతనిని బెల్లం గారు అని పిలుస్తాను. దయచేసి మీరు ఎవరు అలా పిలవకండి కాపీరైట్ వేస్తాను అంటే స్పందించారు.
Also Read: Kalpika Ganesh : ఎంతకు తెగించావు కల్పికా, సబ్స్క్రైబర్స్ కోసం హల్చల్