BigTV English

Sreeleela: బుగ్గపై చుక్క, బుట్టలో బొమ్మలా కూర్చొని.. పెళ్లి కూతురులా తయారైన శ్రీలీల, ఫోటోలు చూస్తే షాకే!

Sreeleela: బుగ్గపై చుక్క, బుట్టలో బొమ్మలా కూర్చొని.. పెళ్లి కూతురులా తయారైన శ్రీలీల, ఫోటోలు చూస్తే షాకే!

Sreeleela: పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల(Sreeleela). తన మొదటి సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకో లేకపోయిన తన నటన, అంద చందాలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో శ్రీ లీల నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. తదుపరి సినిమాలు అనుకున్నంత స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు తగ్గలేదు.


మాస్ జాతర…

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర అనే సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ఈమె బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈరోజు ఉదయం నుంచి శ్రీ లీల వరుస ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నేడు ఉదయం ఈమెకు పసుపు రాస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బిగ్ డే అంటూ క్యాప్షన్ ఇచ్చారు.


అచ్చం పెళ్లికూతురిలా…

శ్రీ లీల ఈ విధమైనటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు కొంపదీసి శ్రీ లీల పెళ్లికి సిద్ధమైందా అంటూ ఆశ్చర్యపోయారు. తాజాగా మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఈమె పెళ్లి కూతురులా ముస్తాబయి, బుగ్గన చుక్క పెట్టుకొని, బుట్టలో బుట్ట బొమ్మల కూర్చొని ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ నిజంగానే శ్రీ లీల పెళ్లికి సిద్ధమైందా అంటూ షాక్ లో ఉండిపోయారు.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె తన ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరిగాయని అయితే ఈ పుట్టినరోజు వేడుకలు ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (Pre Birthday Celebrations)అని, ఈ ప్లాన్ మొత్తం తన అమ్మదే అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.. ఇక శ్రీ లీల జూన్ 14వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనున్నారు. అయితే ముందుగానే తన కుటుంబ సభ్యులు ఇలా భిన్నంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ముందుగానే ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక శ్రీ లీల తెలుగులో చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనంతరం పుష్ప 2 సినిమాలు కిస్సిక్ పాటతో అలరించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×