Ajaz Khan : బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆజాజ్ ఖాన్ పేరు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఆయనకు వ్యతిరేకత మొదలైంది. అంతేకాదు ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. అజాజ్ ఖాన్‌పై ఇప్పటికే అశ్లీల కంటెంట్‌కు సంబంధించి ఓ కేసు నమోదైంది. అజాజ్ హోస్ట్‌గా చేసే ఉల్లు యాప్‌లో ప్రసారమయ్యే వెబ్ షో ‘హౌస్ అరెస్ట్’లో అశ్లీల కంటెంట్ ప్రదర్శించారనే ఆరోపణలపై నటుడితోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఆయన పై మరో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఓ మహిళ అత్యాచారం చేశారంటూ ఆయనపై రేప్ కేసు పెట్టింది. అయితే తాజాగా ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
అజాజ్ ఖాన్‌పై రేప్ కేసు నమోదు..
హౌజ్ అరెస్ట్ షో హోస్ట్, బాలీవుడ్ నటుడు అజాబ్ ఖాన్ పై మరో కేసు నమోదు.. ఆ షోలో మొత్తం బూతులు కనిపిస్తున్నాయని ఫిర్యాదు అందింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఆ షో ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు కూడా వినిపించడంతో అతనిపై కేసు నమోదు చేశారు. తాజాగా అజాబ్ ఖాన్ పై రేప్ కేసు కూడా పెట్టారు. సినిమా ఆఫర్స్ ఇస్తానని నమ్మించి అజాబ్… తనపై చాలా సార్లు లైంగిక దాడి చేసినట్లు… ఓ యువతి ముంబైలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఓ 30 ఏళ్ల మహిళ సినిమా అవకాశాల కోసం అతని దగ్గరకు వెళ్తే అతను అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. తాజాగా ఆయన ఈ కేసు గురించి తెలుసుకున్న నటుడు పారిపోయినట్లు తెలుస్తుంది.
పరారీలో నటుడు ఆజాజ్ ఖాన్..
నటుడు ఆజాద్ ఖాన్ పై వరుసగా కేసులు నమోదవ్వడం బాలీవుడ్ ఇండస్ట్రీ ని కుదిపేస్తుంది.. ఇండస్ట్రీలో ఆయన గురించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్న షో గురించి ఆయనపై కేసు నమోదయింది. ఇక నిర్ణయం ఓ యువతీ తనని దారుణంగా మోసం చేశాడంటూ అతనిపై రేప్ కేసు పెట్టింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నటుడుని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నట్లు తెలుస్తుంది. అతని ఇంటికి వెళ్తే అక్కడ ఆయన లేనట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ప్రస్తుతం ఆజాజ్ ఎవరికి అందుబాటులో లేడని తెలుస్తుంది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం ముంబై అంతా గాలిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే నటుడిని పట్టుకొని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. మరి నిజంగానే ఆయన పరారీలో ఉన్నాడా? మరి ఏదైనా కారణాలవల్ల ఎవరికి అందుబాటులో లేకుండా పోయారా? అన్న విషయాల గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి..