BigTV English
Advertisement

Erectile Dysfunction Fruit: పడకగదిలో ఆ సమస్య.. ఈ పండు తింటే వయాగ్రా లాంటి శక్తి

Erectile Dysfunction Fruit: పడకగదిలో ఆ సమస్య.. ఈ పండు తింటే వయాగ్రా లాంటి శక్తి

Erectile Dysfunction Fruit| చాలామంది పురుషులకు పడకగదిలో దాంపత్య సుఖం పొందడం విఫలమవుతుంటారు. దీనికి చాలా కారణాలుండగా.. చాలా అధ్యయనాల ప్రకారం.. ముఖ్య కారణం మాత్రం అంగ స్తంభనగా తేలింది. ఈ సమస్యకు పరిష్కారంగా వయాగ్రా లాంటి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సమస్యకు ప్రకృతిపరమైన ఈజీ పరిష్కారం కూడా ఉంది. పైగా అందరూ ఇష్టంగా తినే పండు అది. వేసవిలో అందరూ ఎక్కువగా తినే పుచ్చకాయ (Water Melon). వైద్య నిపుణుల ప్రకారం.. పుచ్చకాయలోని విటమిన్స్, అమినో యాసిడ్స్ అంగ స్తంభన సమస్యను చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి.


పురుషుల శరీరంలో కొన్ని అణువులు దెబ్బతినడంతో అంగంలో సరిగా రక్తప్రసరణ సరిగా జరగదు. పుచ్చకాయలోని పోషకాలు అంగంలో రక్తప్రసరణ మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి. పుచ్చకాయలో ఉండే మరో పోషకం సిట్రుల్లిన్ కూడా అంగ స్తంభనకు కారణమయ్యే రక్తనాళములో రక్త సరఫరా పెంచడంలో ఉపయోగపడుతుంది.

అంగ స్తంభన సమస్యను నపుంసకత్వముగా అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ప్రపంచంలో 32 కోట్ల మంది అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్య ఉంటే దాంపత్య జీవితం అసంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో పురషులు అవహేళన వల్ల మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు పుచ్చకాయ ద్వారా రివర్స్ చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Also Read: గర్భవతులు చేపలు తింటే ఆ సమస్యలు.. నిపుణుల హెచ్చరిక

తాజాగా ఓ పరిశోధనలో పుచ్చకాయలోని యాంటి ఆక్సిడెంట్స్.. పురుషుల్లో శృంగార, సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుతుంది. ప్రకృతిపరంగా పురుషుల్లో సంతాన్పోత్తి సామర్థ్యం పెంచేందుకు తేనె, అల్లం, డ్రై ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయని జర్నల్ కరెంట్ రీసెర్చ్ ఇన్ ఫుడ్ సైన్స్ లో ప్రచురితైంది. వీటిలో పాటు పుచ్చకాయలో కూడా శరీరంలో రక్త ప్రస్తరణ, హైడ్రేషన్ వేగంగా పెంచేందుకు మంచి పోషకాలుంటాయి.

watermelon erectile dysfunction

ఈ అధ్యయన రచయిత హైతం అల్ మధగి ప్రకారం.. పుచ్చకాయలోని విటమిన్స్, ఆమినో యాసిడ్స్.. పురుషుల అంగంలోని గోనాడ్స్ లో రక్త ప్రసరణ పెంచుతాయి, శరీరంలో డ్యామేజ్ అయిన అణువులను రిపేర్ చేస్తాయి. “పుచ్చకాయలో పురుషుల్లో సంతానోత్పత్తి పెంచేందుకు వీర్య నాణ్యతు మెరుగుపరుస్తాయి తద్వారా అంగస్తంభన సమస్యను రివర్స్ చేస్తాయి. ఇంటులో విటమిన్స్, ఫినాల్స్, ప్రత్యేకమైన ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటిఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ”

నిపుణుల ప్రకారం.. వయాగ్రా ఔషధం తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి శరీరంలో పెరుగుతుంది. రక్తనాళాలకు నైట్రిక్ ఆక్సైడ్ ఉపశమనం కలిగిస్తాయి. ఇప్పుడు అధ్యయనంలో కూడా పుచ్చకాయ తింటే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి బాగా పెరుగుతుందని తేలింది. పుచ్చకాయలో ఉంటే సిట్రుల్లిన్.. ఆర్గినైన్ అనే అమినో యాసిడ్ లాగా మారి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఒత్తిడి గురైన రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తుంది. రక్తనాళాలు రిలాక్స్ అయ్యాక రక్తప్రసరణ మెరుగవుతుంది. పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ లో సిట్రుల్లిన్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. అందుకే పరిశోధన కోసం పుచ్చకాయ జ్యూస్‌ని అంగ స్తంభన సమస్యతో బాధపడే పురుషులకు ఇవ్వగా వారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 

పుచ్చకాయతో వారికి ప్రమాదం
పుచ్చకాయలు ఎక్కువగా తినడం ఆరోగ్యకరమైనప్పటికీ, డైబెటీస్ (మధుమేహం) ఉన్న వారు మాత్రం వైద్యు సలహా మేరకు ఎంత పుచ్చకాయ తినాలో తెలుసుకొని తినడం మంచింది. పుచ్చకాయం, సపోట, చెరకు రసం లాంటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువ. అందుకే అవి మధుమేహ వ్యాధి ఉన్నవారికి ప్రమాదకరం.

అంగ స్తంభన సమస్యకు కారణాలేంటి?
అంగ స్తంభన సమస్య రావడానికి చాలా కారణాలున్నాయి. కానీ వాటిలో ప్రధాన సమస్య రక్తప్రసరణ సరిగా జరగకపోవడం. మానవ శరీరంలో రక్తప్రసరణ రక్తనాళాల ద్వారా జరగుతుంది. వీటి ద్వారా తక్కువ స్థాయిలో అంగానికి రక్తం సరఫరా జరిగినప్పుడు అంగ స్తంభన సమస్య తలెత్తుతుంది.

నాడి వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు.. అంటే మెదడు, వెనెముక, నరాలు కలిగిన వ్యవస్థలో విద్యుత్ శక్తి సరఫరా అవుతూ ఉంటుంది. ఇది మన శరీరంలో కదలికలను ప్రేరేపించడంతో పాటు అంగాన్ని కూడా కదిస్తుంది. ఈ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు కూడా అంగ స్తంభన జరగదు.

ఇక మూడోది శరరంలో హార్మోన్లు విడుదల చేసే ఎండోక్రైన్ వ్యవస్థ తక్కువ స్థాయిలో హార్మోన్లు విడుదల చేసినప్పుడు అంగానికి రక్తప్రసరణ సరిగా జరగదు. అప్పుడు అంగ స్తంభన సమస్య వస్తుంది.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×