SS Rajamouli : అప్పుడెప్పుడో… బాహుబలి టైంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ మాట అంటాడు. తాను ఢిల్లీ వెళ్లిన టైంలో కేంద్ర మంత్రులు.. ఆ బాహుబలి ఏంటి..? ఆ రాజమౌళి ఎవరు..? అని అడిగారట.
దీనికి కృష్ణం రాజు… రాజమౌళి… మన ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై పెట్టే ఏకైక డైరెక్టర్ అని చెప్పాడట. ఈ విషయాన్ని కృష్ణం రాజు బాహుబలి ఈవెంట్‌లో చెప్పాడు. ఆయన చెప్పినట్టు గానే ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టాడు. ఆస్కార్ వచ్చేలా చేశాడు.
అలాంటి డైరెక్టర్ సినిమా అంటే… మరో ఇంటర్నెషనల్ రేంజ్ అనుకోవచ్చు. అందులోనూ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 మూవీ వస్తుందని… అది కూడా ఆఫ్రక అడువుల నేపథ్యంలో ఉంటుందని చెప్పడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
ఇదంత పక్కన పెడితే… SSMB 29 మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన నాటి నుంచి జక్కన్న పబ్లిక్ ఈవెంట్స్ లోకి రాలేదు. నిన్న (ఆదివారం) హిట్ 3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చాడు. అంటే… SSMB 29 మూవీ షూటింగ్ స్టార్ట్ తర్వాత ఫస్ట్ టైం బయటికి వచ్చాడు అన్నమాట.
ఇలాంటి టైంలో, జక్కన్న అభిమానులు గానీ, మహేష్ బాబు అభిమానులు గానీ, తెలుగు సినీ లవర్స్ గానీ అనుకున్నది ఒక్కటే… SSMB 29 నుంచి జక్కన్న ఏదో ఒక్కటి మాట్లాడుతాడు అని.
కానీ, ఈవెంట్ మొత్తంలో SSMB 29 గురించి జక్కన్న ఒక్కటి అంటే ఒక్క ముక్క కూడా మాట్లడలేదు. నిజానికి జక్కన్న ఇలా ఉండేవాడు కాదు. తాను సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో… ఇతర సినిమాల ఫంక్షన్స్, ఈవెంట్స్ కి వస్తే.. తన సినిమా గురించి ఏదో ఒకటి చెప్పి.. అంచనాలు పెంచే వాడు. సినిమా స్టార్టింగ్ నుంచే రాజమౌళి నుంచి ప్రమోషనల్ స్ట్రాటజీలు కనిపించేవి.
కానీ, హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం జక్కన్న నోటి నుంచి కనీసం ఒక్క సారి కూడా SSMB 29 మాట రాలేదు. దీంతో జక్కన్న మొత్తం మారిపోయాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హిట్ 3 ఈవెంట్ లో మూవీ షూటింగ్ పై కనీసం నాలుగు మాటలు మాట్లాడినా… సరిపోయేదని మహేష్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు.
మార్పు మంచిందే.. కానీ, జక్కన్నలో వచ్చిన ఈ మార్పును మాత్రం తాము యాక్సెప్ట్ చేయలేమని అంటున్నారు. జక్కన్న ఎప్పుడూ జక్కన్నలానే ఉండాలని అంటున్నారు.