BigTV English

Mollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఎన్. కరుణ్ మృతి..!

Mollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఎన్. కరుణ్ మృతి..!

Mollywood: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒకరి తరువాత ఒకరు తుది శ్వాస విడుస్తూ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ ఎన్. కరుణ్ (Shaji.N.Karun) కన్నుమూశారు. 73 సంవత్సరాల వయసులో.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఈరోజు మరణించారు. మొదట నలభై చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన.. అనంతరం దర్శకుడిగా మారారు. తన మొదటి చిత్రం ‘పిరవి’ తోనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ కెమెరా మెన్షన్ అవార్డు గెలుచుకున్నారు. స్వప్నం, స్వమ్, వనప్రస్థం, నిషాద్, కుట్టిసరంక్, AKG వంటి చిత్రాలు తీశారు. మరణించాలన్న వార్త తెలుసుకొని అటు అభిమానులు ఇటు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.


అసమాన ప్రతిభతో ఊహించని అవార్డులు..

1952 జనవరి 1న షాజీ నీలకంఠన్ కరుణాకరన్ జన్మించారు. భారతదేశంలో చలనచిత్ర టీవీకి మొట్టమొదటి అకాడమీ అయిన కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీకి ఈయన ప్రీమియర్ చైర్మన్ గా వ్యవహరించారు. ఇక 1998 నుండి 2001 వరకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆఫ్ కేరళకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఉత్తమ దర్శకుడిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా ఆయన అందుకున్నారు. ఇక 2022 నుండి 2024 వరకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేసిన ఈయన.. 73 సంవత్సరాలు వయసులో తిరువనంతపురంలోని తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు.


ALSO READ:Singer Neha: సింగర్ శ్రీకృష్ణ వల్లే నా కెరియర్ నాశనమైంది.. నిజాలు బయటపెట్టిన సింగర్ నేహా..!

కరుణాకరన్ వ్యక్తిగత జీవితం..

ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1975 జనవరి 1న డాక్టర్ పీకేఆర్ వారియర్ కుమార్తె అయిన అనసూయ వారియర్ను వివాహం చేసుకున్నారు.. ఇక దక్షిణ భారత నగరమైన మద్రాస్ లో కొంతకాలం పనిచేసిన ఈయన ఆ తర్వాత 1976లో తిరువనంతపురం కి తిరిగి వచ్చాడు. అక్కడ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ లో ఫిలిం ఆఫీసర్గా ఉద్యోగం అందుకున్నారు. ఇక వివాహం అనంతరం వీరికి అనిల్, అప్పు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత పలువురు ప్రముఖులతో అనుబంధం పెంచుకొని, దేశవ్యాప్తంగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇక కేరళ ప్రభుత్వం ఈయనకు ప్రత్యేక సలహాదారు హోదాను అందించింది. కేరళ ప్రభుత్వం ఆయనను కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించగా.. 2019 న ఆ పదవిని అందుకున్నారు. అయితే 2024 ఆగస్టులో మీ టు ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన రాజీనామా చేశారు.

ALSO READ:Singer Sunitha: ప్రవస్తికి మరో కౌంటర్ ఇచ్చిన సునీత.. చేసిన యాక్షన్ గుర్తుండదంటూ..?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×