Big Stories

Ajith Kumar: ఈసారి తెలుగు టైటిల్‌తో వ‌స్తున్న అజిత్‌

Share this post with your friends

Ajith Kumar : వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోకి నాలుగు చిత్రాలు దిగుతున్నాయి. అందులో ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర హీరోలు న‌టించిన సినిమాలుంటే .. మ‌రో రెండు కోలీవుడ్ అగ్ర హీరోలు న‌టించిన చిత్రాలు అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. ఆ చిత్రాలేవో ఇట్టే చెప్పేయ‌చ్చు మ‌రి. 2013 సంక్రాంతి పోటీలోకి వాలేర్తు వీర‌య్య‌గా చిరంజీవి, వీర సింహా రెడ్డిగా నంద‌మూరి బాల‌కృష్ణ దిగుతున్నారు. మ‌రో వైపు కోలీవుడ్ నుంచి విజ‌య్ వార‌సుడు, అజిత్ తునివు కూడా అనువాద సినిమాలుగా పోటీ ప‌డుతున్నారు. వీటిలో అజిత్ సినిమాను గ‌మ‌నిస్తే.. అజిత్ గ‌త‌సారి వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన వ‌లిమై చిత్రాన్ని.. అదే త‌మిళ పేరుతో విడుద‌ల చేశారు. తెలుగులో టైటిల్ పెట్ట‌కుండా అనువాదం చేసి సినిమాను రిలీజ్ చేయ‌ట‌మేంట‌ని కూడా కొంద‌రు ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో నిర్మాత‌లు ఏదో క‌వ‌ర్ చేసుకున్నారు.

కానీ ‘తునివు’ విష‌యంలో ఈసారి తెలుగు నిర్మాత‌లు ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని టాక్‌. ‘తెగింపు’ అనే టైటిల్‌తో ‘తునివు’ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. మూడు కోట్లు వెచ్చించి అనువాద హ‌క్కులు కొన్నారని, ఆరు కోట్ల వ‌స్తే కానీ తెలుగు నిర్మాత‌లు సేఫ్ జోన్‌లోకి వ‌స్తార‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. తునివు చిత్రానికి హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కుడు. బోనీ క‌పూర్ నిర్మాత‌.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News