BigTV English

Anasuya : అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇదెప్పుడూ సూడలే? నువ్వు గ్రేట్ అక్క!

Anasuya : అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇదెప్పుడూ సూడలే? నువ్వు గ్రేట్ అక్క!

Anasuya: టాలీవుడ్ బుల్లితెర నటి అనసూయ ఓ టీవీ ఛానల్ లో న్యూస్ ప్రెజెంటర్ గా, తన ప్రస్థానం మొదలుపెట్టి, ఎవరు ఊహించని స్థాయిలో స్టార్ గా ఎదిగారు. స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా ఆమె నట ప్రస్థానం సాగుతోంది. బుల్లితెరపై యాంకర్ గా, జబర్దస్త్ ప్రోగ్రాం తో క్రేజ్ సంపాదించిన అనసూయ, అదే స్టార్ డంతో సినిమాలలో నటించారు. ప్రస్తుతం కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ లో జడ్జ్ గా వ్యవహరిస్తూ, సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు(may 15 )సందర్భంగా ఓ అనాధాశ్రమంలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈరోజు ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అంటూ పోస్ట్ చేశారు.ఆ వివరాలు చూద్దాం..


అనసూయలో ఈ యాంగిల్ కూడానా ..

అందం, అభినయంలో ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై, అవకాశాలు పట్టేస్తున్న నటి అనసూయ. ఈ ముద్దుగుమ్మ మే 15న తన పుట్టినరోజును డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. హైదరాబాదులోని ఓ అనాధ శరణాయానికి తన భర్తతో, కలిసి వెళ్లి, అక్కడ చిన్నారులతో ఆడుతూ పాడుతూ, వారితో డాన్స్ చేస్తూ, అక్కడి పిల్లలతో ముచ్చటిస్తూ, వారికి కావాల్సిన వస్తువులను అందించి, వారికి మంచి భోజనాన్ని అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల అనసూయ ఆమె కట్టుకున్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం అవుతున్నట్లుగా మూడు రోజుల కిందట కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన వారంతా, అనసూయలో ఈ కోణం కూడా ఉందా అంటూ, తన పుట్టినరోజుని ఇలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకొని ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


నువ్వు గ్రేట్ అక్క..

ఇక అనసూయ ఇటీవల వచ్చిన పుష్ప 2 మూవీలో నటించిన మెప్పించారు. ప్రస్తుతం ఆమె టీవీ ప్రోగ్రామ్స్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మాటీవీలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ప్రోగ్రాం కి, ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంతే కాక మాటీవీలో పలు ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు.ఇక అనసూయ సినిమా విషయానికి వస్తే ఆమె 2003లో వచ్చిన నాగ సినిమా తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్నినాయన, క్షణం, విన్నర్, వంటి చిత్రాల్లో మెప్పించారు. 2018 లో వచ్చిన రంగస్థలం సినిమాలో  అనసూయ మెప్పించింది. ఆ తర్వాత ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం యాత్ర చావు కబురు చల్లగా, థాంక్యూ బ్రదర్, వంటి సినిమాల్లో నటించారు. ఇక 2021 లో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయిని అనే విలన్ క్యారెక్టర్ లో నటించారు. ఆ పాత్రతో ఆమె నటన ప్రస్థానం మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి భీష్మ పర్వం, ఖిలాడీ, వాంటెడ్ పండుగాడు, ఫ్లాష్ బ్యాక్, రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, పెదకాపు, సింబ, రజాకర్, పుష్ప 2 వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.

Related News

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Big Stories

×