BigTV English

Vidaamuyarchi : అజిత్ సినిమాలో ఇలాంటి బూతు పదాలా? సెన్సార్ కత్తెర పడిన సీన్స్ ఇవే

Vidaamuyarchi : అజిత్ సినిమాలో ఇలాంటి బూతు పదాలా? సెన్సార్ కత్తెర పడిన సీన్స్ ఇవే
Advertisement

Vidaamuyarchi : టాలీవుడ్ లో సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో, కోలీవుడ్ లో కూడా అచ్చం ఇలాగే పెద్ద సినిమాలు సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తాయి. అలా ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీగా ఎదురు చూసిన తమిళ మూవీ ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). అయితే ఈ సినిమా ఊహించని విధంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘విదాముయార్చి’ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి కాగా, సెన్సార్ రిపోర్ట్ తో పాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఆ రిపోర్ట్ చూసిన నెటిజెన్లు అజిత్ (Ajith) సినిమాలో బూ*తులా? అంటూ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఇందులో ఉన్న అలాంటి పదాలు ఏంటి? సెన్సార్ కత్తెర వేసిన సీన్లు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


‘విదాముయార్చి’ సెన్సార్ పూర్తి 

‘విదాముయార్చి’ (Vidaamuyarchi) సెన్సార్ రిపోర్ట్ లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఈ సినిమా మొత్తం 150.46 నిమిషాల రన్ టైం తో ఉంటుంది. అంటే 2 గంటల 30 నిమిషాల 46 సెకండ్లు. ఇక సెన్సార్ కత్తెర వేసిన పదాలలో కొన్ని కస్ వర్డ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాలోని ఫ*, బాస్ట*, బి*, స్ల* వంటి పదాలను సబ్ టైటిల్స్ తో సహా లేపేసారట. ఆడియోలో మాత్రం మ్యూట్ చేశారని తెలుస్తోంది. ఇక ‘సోడియం హైడ్రాక్సైడ్’ అనే పదాన్ని,  కూడా మ్యూట్ చేశారు. ఈ పదాలతో పాటు ఓ వైలెన్స్ సీన్ ని మోడీపై చేసినట్టు సమాచారం. అలాగే సినిమాలో స్మోకింగ్ డిస్క్లయిమర్ మిస్ అయిన ప్లేస్ లలో వేయాలని చెప్పారట. అంతేకాకుండా డిస్క్లయిమర్ కనిపించే విధంగా బోల్డ్ బ్లాక్ ఫాంట్, వైట్ బ్యాక్ గ్రౌండ్ తో పెద్దగా ఉండాలని సెన్సార్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్ నేమ్స్ ని కూడా రిమూవ్ చేశారని సమాచారం.


‘విదాముయార్చి’ వాయిదా 

ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ‘విదాముయార్చి’ (Vidaamuyarchi) సినిమా ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజిత్ (Ajith) సరసన త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. అనుకోని కారణాల వల్ల ఈ మూవీని వాయిదా వేసామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నామని మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని జనవరి 28 లేదా 30న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

కాగా ‘విదాముయార్చి’ (Vidaamuyarchi) ఒక యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్. ఈ మూవీ హాలీవుడ్ చిత్రం ‘బ్రేక్‌డౌన్’ నుండి ప్రేరణ పొందవచ్చని పుకార్లు ఉన్నాయి, కానీ దీనిపై మేకర్స్ ఇంకా అఫిషియల్ గా స్పందించలేదు. ఓ జంట అజర్‌బైజాన్‌లో  విహారయాత్రకు వెళ్ళగా, అక్కడ అతడి భార్య కిడ్నాప్‌కు గురవుతుంది. భార్యను అతను ఎలా కాపాడుకున్నాడు ? హీరో భార్యను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు? అనేది ఈ మూవీ స్టోరీ.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×