Ram Charan Game Changer :మరి కొన్ని గంటల్లో రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు ప్రాంతాలలో పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు కొన్ని గంటల ముందు సినిమాపై భారీ హైప్ పెంచుతూ.. ఒక మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాలో హైలెట్స్ ఇవే అంటూ కొన్ని విషయాలు కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేసాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
గేమ్ ఛేంజర్ హైలెట్స్ ఇవే..
1. గేమ్ ఛేంజర్ సినిమా ఓపెనింగ్ సీనే ఒక యాక్షన్ సీన్ అని సమాచారం. భారీ యాక్షన్ సీన్ గా ట్రైలర్ లో చూపించిన హెలీక్యాప్టర్ సీనే సినిమా ఓపెనింగ్ సన్నివేశమని తెలుస్తోంది. ఇది మాస్ ఆడియన్స్ కి ఫుల్ హైప్ ఇస్తుందని చెప్పవచ్చు.
2. అంతేకాదు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే హైప్ కంటిన్యూ అవుతుంది.
3. ఫస్ట్ హాఫ్ లో ఐఏఎస్ రామ్ నందన్ సీన్స్ ఉంటాయి.
4. యాక్షన్, పాటలు, డాన్స్ తో పాటు కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది.
5. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్న కొన్ని అభివృద్ధి పనులు కూడా మొదటి భాగంలోనే చూపించేలా డిజైన్ చేశారు శంకర్.
6. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేస్తున్న అభివృద్ధి పనులలో.. ముఖ్యమైనవి రోడ్లు వేయడం, వాటర్ ఫెసిలిటీ లాంటివి కూడా చూపించడం తోపాటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న హైడ్రో లాంటివి కూడా.. మొదటి భాగంలోనే కనిపిస్తాయి. అంతేకాదు ఇవన్నీ కూడా ఐఏఎస్ రామ్ నందన్ చేస్తాడు.
7. ఇక రెండవ భాగం విషయానికి వస్తే.. రామ్ నందన్ తండ్రి పాత్ర అప్పన్న క్యారెక్టర్ ని మనం చూడవచ్చు
8.క్లైమాక్స్ కూడా ఏమాత్రం నిరాశపరచదు. శంకర్ స్టైల్ లోనే భారీ లెవెల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు.
మొత్తానికైతే ఈ అంశాలు సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా.. అభిమానులలో ఫుల్ జోష్ నింపుతున్నాయి. ఏది ఏమైనా అభిమానులకు ఫస్ట్ సీన్ నుండే పూనకాలు వస్తాయనడంలో సందేహం లేదు..
గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలు..
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. జనవరి 10వ తేదీన రాబోతున్న ఈ సినిమాకి, దిల్ రాజు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేశారు . ఈ సినిమాలోని పాటల కోసమే రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ చరణ్ రూ.65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పోల్చుకుంటే ఇది తక్కువే అని చెప్పాలి. ఇందులో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, కియారా అద్వానీ, అంజలి వంటి భారీ తారాగణం కూడా భాగమైంది. ఒక పొలిటిషన్ కి, ప్రభుత్వ ఉద్యోగికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.