Pattudala..కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్ (Ajith). ఈయన సినిమాలు అంటే అడ్వెంచర్, యాక్షన్ చిత్రాలకు పెద్ద పీట వేస్తారు అనడంలో సందేహం లేదు. రెగ్యులర్గా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలకు భిన్నంగా.. మగిజ్ తిరుమేని (Magizh thirumeni) దర్శకత్వంలో తాజాగా విడాముయర్చి (Vidaamuyarchi)అనే సినిమాతో ఫిబ్రవరి 6 అనగా ఈరోజు ప్రేక్షకులు ముందుకి వచ్చారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఇదే సినిమాను తెలుగులో ‘పట్టుదల’ (Pattudala) పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రానికి భిన్నంగా ఈ సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ తోనే అర్థమైంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా అనిపించకపోవడంతో పట్టుదల సినిమా మీద అటు ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది.
రూ.2 కోట్లు ఖర్చు పెడితే, ఒక్క రూపాయి కూడా రాదేమో..
ఇక ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే మెప్పించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మితమైన ఈ సినిమాను తెలుగులో రూ.2కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేశారు. కానీ థియేటర్లు మొత్తం ఖాళీనే. ఒక్క రూపాయి కూడా రాదేమో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి డిజాస్టర్ గా ఈ సినిమా తెలుగులో నిలవనుంది అనేట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పట్టుదల సినిమా పట్టు తప్పిందని కనీసం 50% కూడా లాభం వచ్చేటట్టు కనిపించడం లేదని సమాచారం. మొత్తానికైతే తెలుగులో ఒక్కరోజు కూడా ఆడని ఈ సినిమా పూర్తి డిజాస్టర్ గా మారింది అని చెప్పవచ్చు.
పట్టుదల సినిమా కథ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో అజిత్ హీరోగా, త్రిష (Trisha) హీరోయిన్ గా నటించారు. హీరో, హీరోయిన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు .12 ఏళ్ల తర్వాత వైవాహిక బంధానికి హీరోయిన్ స్వస్తి పలకాలని అనుకుంటుంది. దీనికి కారణం ఆమె వివాహేతర సంబంధం పెట్టుకొని ఉంటుంది. అయితే ఈ విషయం హీరోకి తెలిసినా కూడా.. తాను ఎంతో ప్రేమించిన హీరోయిన్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె మాత్రం విడాకులు కోరుకుంటుంది. ఈ క్రమంలోనే తన పుట్టింటికి వెళ్దామని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ ని ఇంట్లో దిగబెట్టడానికి హీరో వస్తానని అంటాడు. అదే తమ చివరి ప్రయాణం అవుతుంది కదా.. తానే దగ్గరుండి దిగబెట్టి వస్తానని చెబుతాడు.. ఈ ప్రయాణంలో హీరో , హీరోయిన్ కి ఎదురైన సమస్యలు ఏమిటి? హీరోయిన్ ని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అసలు వీరిద్దరి మధ్య ఎదురైన సమస్యలు ఏంటి? ఇక ఈ ప్రయాణంలో రెజీనా (Regina cassandra), అర్జున్ సర్జ (Arjun Sarja) పాత్ర ఏంటి? చివరకు తన భార్యను కాపాడుకునేందుకు ‘పట్టుదల’తో అర్జున్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేది థియేటర్లో చూడాలి. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా సో సో గా నడిచింది. ఎన్నో అంచనాలను పెట్టుకొని వెళ్లిన ఆడియన్స్ కి అంత త్వరగా ఈ సినిమా ఎక్కదు అని చెప్పడంలో సందేహం లేదు.