Naga Chaitanya: గత కొన్ని సంవత్సరాలుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya). అప్పుడెప్పుడో తన తండ్రి నాగార్జున(Nagarjuna)తో కలిసి 2022లో బంగార్రాజు(Bangarraju) సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య, ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం నాగచైతన్య చేతిలో తండేల్ (Thandel) సినిమా మాత్రమే ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో చందు మొండేటి (Chandu Mondeti) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో నాగచైతన్య సరసన మళ్లీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా జతకట్టిన విషయం తెలిసిందే.
రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పిన చైతూ..
శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇదిలా ఉండగా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే నిన్న ట్విట్టర్లో నాగచైతన్య, సాయి పల్లవి మమ్మల్ని మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి.. మేము ఒకరినొకరు అడుగుతాము అంటూ పోస్ట్ చేశారు. ఇక అందులో భాగంగానే వాళ్లకు వచ్చిన ప్రశ్నల్ని.. ఒకరిని ఒకరు అడిగి వాటికి సమాధానాలు చెప్పిన వీడియోలను కూడా సాయి పల్లవి, నాగచైతన్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోని సాయి పల్లవి.. నాగచైతన్యను ప్రశ్నిస్తూ ఏ క్యారెక్టర్ తో నీ లైఫ్ ని సెట్ చేయాలనుకుంటున్నావు? అని అడగ్గా..దానికి నాగచైతన్య మాట్లాడుతూ..” నేను గతంలో కూడా ఒకసారి ఈ విషయంపై మాట్లాడాను. సినిమా ఇండస్ట్రీలో నా రిటైర్మెంట్ ప్లాన్ కి దగ్గరగా ఉండేది ప్రేమమ్ సినిమా క్యారెక్టర్ మాత్రమే. ప్రేమమ్ సినిమా చివర్లో ఒక రెస్టారెంట్ పెట్టుకొని సెటిల్ అవుతాడు. అలాగే నేను కూడా నా రిటైర్మెంట్లో కూడా ఒక సొంత రెస్టారెంట్ ను పెట్టుకొని అందులో చెఫ్ గా మారి సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను” అంటూ తన చివరి కోరికను రిటైర్మెంట్ తర్వాత తాను ఏం చేయాలనుకున్న విషయాన్ని కూడా స్పష్టంగా క్లారిటీగా వెల్లడించారు నాగచైతన్య. ఇక ఈ విషయం తెలిసి ఫ్యూచర్ ప్లాన్స్ చాలా బాగున్నాయి అని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
“షో యు” ఫుడ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్న చైతూ..
ఇకపోతే నాగచైతన్య మంచి వంటకారి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఆయనకు “షో యు” అని ఒక ఫుడ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్ కూడా ఉంది. అందులో అప్పుడప్పుడు సరదాగా వంట చేస్తూ ఉంటాడు. ఇక చైతూ భవిష్యత్తులో ఆ క్లౌడ్ కిచెన్ ను కాస్త రెస్టారెంట్ గా మార్చబోతున్నారని సమాచారం. అంతేకాదు ఇటీవల తండేల్ సినిమా షూటింగ్లో చేపల కూర వండి మరీ యూనిట్కి రుచి చూపించాడు నాగచైతన్య. మొత్తానికి అయితే ఇది చూసిన నెటిజన్స్ చైతూ అప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకొని దానికి కావాల్సింది కూడా సిద్ధం చేసుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు.