BigTV English

Hero Ajith: పద్మభూషణ్ అందుకున్న అజిత్ ఎన్ని వేల కోట్లకు ఆస్తిపరుడో తెలుసా..?

Hero Ajith: పద్మభూషణ్ అందుకున్న అజిత్ ఎన్ని వేల కోట్లకు ఆస్తిపరుడో తెలుసా..?

Hero Ajith:గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పద్మ అవార్డులలో కళారంగానికి విశిష్ట సేవలు చేసినందుకుగానూ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), తమిళ నటుడు అజిత్ (Ajith), సీనియర్ హీరోయిన్ శోభన(Shobhana) లకు పద్మ అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే సెలబ్రెటీలకు పద్మ అవార్డులు రావడంతో.. వారు ఇంతకుముందు అందుకున్న అవార్డులు, రివార్డులు, వారు ఇంతకు ముందు సాధించిన ఎన్నో విజయాలను సోషల్ మీడియా జనాలు గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పద్మభూషణ్ అందుకున్న అజిత్ గురించి తెలియని విషయాలు,ఆయన ఆస్తిపాస్తులు అన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పద్మభూషణ్ అందుకున్న స్టార్ హీరో అజిత్ ఆస్తిపాస్తులు ఎన్ని.. ? ఆయన ఇప్పటివరకు తన సినిమాల ద్వారా ఎన్ని ఆస్తులు కూడబెట్టారు? అనేది ఇప్పుడు చూద్దాం..


రూ.350 కోట్లకు పైగా ఆస్తులు..

కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ కేవలం కోలీవుడ్ వరకు మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా అభిమానులు ఉన్న హీరో. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అలా సౌత్ స్టార్ హీరో అయిన అజిత్ తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అజిత్ కి మిగతా హీరోలందరికీ చాలా తేడాలు ఉంటాయి.ఎంతో మంది హీరోలు డబ్బులు ఇచ్చి మరీ అభిమానులను పెట్టుకుంటూ ఉంటారు. కానీ అజిత్ మాత్రం తనకి అభిమాన సంఘాలు ఉండవద్దని, అభిమాన సంఘాలను కూడా రద్దు చేశారు.నాకోసం పోరాడితే ఏమి రాదు. మీ ఫ్యామిలీల కోసం పోరాడాలి అని చెబుతూ ఉంటారు.అయితే అలాంటి హీరో తాజాగా పద్మభూషణ్ అందుకోవడంతో ఆయనకి సంబంధించిన ఆస్తిపాస్తులు నెట్టింట వైరల్ గా మారాయి. అజిత్ ఆస్తి విలువ సుమారు రూ.350 కోట్లకు పైగా వుంటుందని తెలుస్తోంది.అజిత్ తన ఒక్కో సినిమాకి గతంలో రూ .100 కోట్లకు పైగా పారితోషికం తీసుకునేవారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం, ఆయన రేంజ్ పెరగడంతో ఒక్కో సినిమాకు రూ .150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.


సినిమాలే కాదు కార్ రేసింగ్ అంటే కూడా ఇష్టం..

అలా ఇప్పటివరకు 350 కోట్ల ఆస్తులు కూడబెట్టిన అజిత్ కి చెన్నైలో లగ్జరీ ఇల్లు తో పాటు ఎన్నో స్థిర చరాస్తులు ఉన్నాయట. అలాగే ఆయన కారు గ్యారేజీలో చూస్తే లాంబోర్గిని, ఫెరారీ, ఫోర్స్చే, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక అజిత్ కి కేవలం సినిమాలు మాత్రమే కాదు కార్ రేసింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం.గతంలో ఈయన కార్ రేసింగ్ లో పాల్గొని గాయాల పాలవ్వవడంతో కొద్దిరోజులు కార్ రేసింగ్ కి దూరంగా ఉన్నారు. ఇక రీసెంట్ గా మళ్లీ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొని దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ పోటీలో పాల్గొని మూడో ప్లేస్ సాధించి ఇండియన్ ఫ్లాగ్ ని గర్వంగా చేతుల్లో పట్టుకొని ఊపిన వీడియోలు ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ గా మారుతాయి.అలా ఓవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్ చేస్తూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు అజిత్.ఇక అజిత్, త్రిష కలిసి నటించిన ‘విదాముయార్చి’ సినిమా ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×