Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అత్యంత దారుణమైన ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అంతర్జాతీయ టోర్నీలో వరుసగా విఫలమైన రోహిత్ శర్మను బీసీసీఐ రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా సూచించింది. గౌతమ్ గంభీర్ ఆదేశాల మేరకు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రంజిల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెడనొప్పి కారణంగా కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడకపోగా…. రోహిత్ చాలా కాలం తర్వాత రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రోహిత్ దేశీయ టోర్నీలలో ఆడేందుకు ఒప్పుకున్న సమయంలో మొదటగా బౌలర్లు చాలా సంతోషించారు.
విధ్వంసకర బ్యాట్స్మెన్ రోహిత్ ను బౌలింగ్ చేయడానికి బౌలర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ అయ్యి బౌలర్లను సైతం నిరాశపరిచాడు. జనవరి 23 నుంచి ముంబై-జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమార్ నజీర్ బౌలింగ్ లో రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడు. అయితే రోహిత్ వికెట్ తీసిన అనంతరం ఉమార్ నజీర్ సంబరాలు చేసుకోలేదు. ఎప్పటికైనా అంతర్జాతీయ క్రికెటర్ లో రోహిత్ శర్మతో కలిసి ఆడాలనుకున్న.. రోహిత్ పేలవ ఫామ్ ని చూసి బాధపడ్డాడు ఉమర్ నజీర్ ( Umar Nazir ).
Also Read: Mohammed Siraj: ఆ సింగర్‌తో DSP సిరాజ్ డేటింగ్.. పోటోలు వైరల్!
వికెట్ తీసిన ఆనందం ఏ మాత్రం ఉమర్ నజీర్ ( Umar Nazir )…లో కనిపించలేదు. ఆట ముగిసిన అనంతరం ఉమర్ నజీర్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. నేను రోహిత్ భాయ్ కి వీరాభిమానిని అని ఉమార్ నజీర్ అన్నాడు. అయితే రోహిత్ శర్మ వికెట్ తీయడం తనకు చాలా ఆనందాన్ని కలిగించినప్పటికీ రోహిత్ తక్కువ పరుగులు చేసి అవుట్ అవ్వడం తనకు చాలా బాధగా అనిపించిందని ఉమర్ నజీర్ అన్నాడు. విశేషమేంటంటే ఉమర్ నజీర్…. రోహిత్ శర్మకు మొదటిసారి బౌలింగ్ చేశాడు. కాగా, ముంబై తొలి ఇన్నింగ్స్ లో ఉమర్ నజీర్ ( Umar Nazir ) నాలుగు భారీ వికెట్లు తీశాడు.
రోహిత్ శర్మతో పాటు అజింక్య రహానే, శివమ్ దూబే వంటి ఆటగాళ్లను బలి పశువులను చేసేశారు. ఉమార్ నజీర్ 11 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి మొత్తం నాలుగు వికెట్లు తీసేశాడు. ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 120 పరుగులకే పరిమితమైంది. మూడు పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. జైస్వాల్ 4 పరుగులు, అజింక్య రహానే 12, శ్రేయస్ అయ్యర్ 11 పరుగులు చేశారు. కాగా, శివమ్ దూబే ఖాత తెరవక ముందే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆపై ఎనిమిదవ నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కు 51 పరుగుల ఇన్నింగ్స్ తో జట్టును 120 పరుగులకు చేర్చాడు. ఇది ఇలా ఉండగా..ఈ రంజీలో జమ్మూ కశ్మీర్ సంచలనం సృష్టించింది. ముంబైపై విక్టరీ సాధించింది జమ్మూ.
Also Read: Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?